Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Yummy Drumsticks-Mutton Village Style

ఈ సంచికలో >> శీర్షికలు >>

స్వేచ్ఛ - శ్రావణ్ దమ్ములూరి

freedom

 నేను ఒక  పక్షిని.... నన్ను మీరు ఏమని పిలుస్తారో  నాకు తెలియదు. కానీ, మా అమ్మ నన్ను మంచి శబ్దంతో పిలుస్తుంది. మాది చాలా చిన్న కుటుంబం , నేను మా అమ్మ మాత్రమే. నేను చాలా చిన్నదానిని అందుకే మా అమ్మ  నన్ను బయటకు పంపేది కాదు, మా అమ్మ మాకోసం కట్టిన గూటిలోనే ఉండమని చెప్పేది.  కానీ , మా అమ్మ నా కోసం ఆహరం తీసుకురావటానికి వెళుతున్నప్పుడు , మేమున్న చెట్టు ఎక్కి చూసేదాన్ని ఈ ప్రపంచంలో ఎం జరుగుతుందో ....
ఈ ప్రపంచం చాలా అందంగా ఉంది చుట్టూ పచ్చగా , ఎంతో ప్రశాంతంగా. ఎందుకు మా అమ్మ బయటకు పంపటం లేదు  , బయట ఇంత అందంగా ఉంటె. ఇంత అందమైన ప్రపంచాన్ని చుడనివ్వకుండా మా అమ్మ నన్ను ఎందుకు గూటిలోనే ఉంచుతుంది . నాకు ఈ ప్రపంచం బాగా నచ్చింది మా అమ్మలా ఎగిరి వెళదాం అనుకుంటే , నావి ఇంకా చిన్న రెక్కలు పూర్తిగా ఎగరలేకపోతున్నాను . ఇంతలో మా అమ్మ రావటం కనిపించి మరలా గుటిలోకి చేరిపోయాను .
రోజూ ఇలానే చేస్తున్నాను ... నేను ఇలా  బయటకి వెళ్లి తిరిగి వస్తున్నట్టు మా అమ్మకి తెలియదు. ఈ రోజు  కూడా అలానే బయటకు వచ్చాను ...అంతలో , ఒక చిన్న పండు మా అమ్మ తీసుకువచ్చేలాంటిది చెట్టు కింద కనిపించింది , నాకు  తినాలనిపించి అటువైపు వెళ్ళాను .  ఆ పండుని తీసుకునేలోపు.....ఒక పెద్ద  పక్షి, మా అమ్మ కంటే చాలా పెద్దదిగా ఉంది. మా పక్షులన్నీ దీనికే బయపడతాయి , అందుకేనేమో మా అమ్మ నన్ను బయటకు వెళ్లొద్దు అని చెప్పింది. ఇలా ఆలోచిస్తుండగా అది నన్ను వెనుక నుండి పొడిచింది. చాలా నొప్పిగా ఉంది , అది నన్ను అలా పొడుస్తూనే ఉంది. ఎగిరి వెళ్ళిపోదాం అనుకుంటే నా రెక్కలు విచ్చుకోవటం లేదు ......ఇది నన్ను ....కచ్చితంగా చంపేస్తుంది . దానికి నాకు బాధగా లేదు కానీ మా అమ్మ నేను ఏమైపోయానో అని చాలా ఆందోళన చెందుతుంది, గుండెలు పగిలేలా ఏడుస్తుంది పాపం. ఇదంతా నేను చేసిన తప్పే ... నేను ఆ  పండు కోసం ఆశపడకుండా ఉండాల్సింది . ఎలాగూ మా అమ్మ నా కోసం తినటానికి ఎదో ఒకటి తీసుకొని వస్తుంది. నేను ఈ ప్రపంచం అందంగా ఉంది , చాలా ప్రశాంతంగా ఉంది అనుకోని బయటకు వచ్చాను. కానీ , మా అమ్మ నన్ను ఎందుకు బయటకు వెళ్లొద్దు  అని చెప్పిందో ఆలోచించలేకపోయాను . ఎందుకు నన్ను ఇలా గూటిలోనే కట్టి పడేస్తుంది , ఎందుకు నన్ను స్వేచ్ఛగా బయట ఈ అందమైన ప్రపంచంలో  తిరుగనివ్వటంలేదు. ఎందుకు నా పట్ల ఇంత పట్టుదలగా ఉంటుంది మా అమ్మ .. ఎందుకు నేనంటే అంత కోపం.  ఇలానే ఆలోచించాను... కానీ , నేను అప్పుడు అలా ఆలోచించింది చాలా తప్పని ... ఇప్పుడు నా ప్రాణాలమీదకి వచ్చేవరకు తెలియలేదు. మా అమ్మ నన్ను బయటకు పంపటం ఇష్టంలేక... నన్ను గూటిలో ఉంచలేదు , నాకు రెక్కలకు ఇంకా పూర్తిగా ఎగిరే సామర్థ్యం రాలేదు కనుక .... పంపితే నేను  ఏ  ప్రమాదంలో చిక్కుకుంటానో అని బయపడి. కానీ , నేను నా స్వేచ్ఛ గురించి మాత్రమే  ఆలోచించాను ... మా అమ్మకు నా పై ఉన్న ప్రేమ, పెంచుకున్న ఆశల  గురించి ఆలోచించ లేక పోయాను.  
నన్ను క్షమించమా......
************
ఇది ఒక చిన్న పక్షి తెలియక చేసిన తప్పు...... ఇలాంటి  తప్పులే మనుషులమైన మనం ఎన్నో తల్లి తండ్రులను నొప్పించేలా చేస్తున్నాం. " స్వేచ్ఛ " అనే మాటను అడ్డం పెట్టుకొని , ఇంకెంతకాలం మమ్మల్ని ఇలా "ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు" అని నిర్ణయిస్తారు. మాకు ఏం కావాలో మేము  నిర్ణయించుకోగలము మమ్మల్ని వదిలేయండి. స్వేచ్ఛగా ఈ ప్రపంచంలో ఎగరనివ్వండి , కట్టిపడెయ్యకండి.... అని   అంటుంటాం . ఇటువంటి ఆలోచనలు , స్వభావం చిన్న వయసులో  రానివ్వకండి . మీకు ఎగిరే సామర్థ్యం వచ్చిందని తెలిస్తే వాళ్లే మిమ్మల్ని .... ఈ "స్వేచ్ఛా ప్రపంచంలో హాయిగా ఎగరమని వదిలేస్తారు" నేటి ప్రపంచంలో , ఇటువంటి ఆలోచనా విధానం పిల్లలలో ఎక్కువగా , త్వరగా వచ్చేస్తున్నాయి . కాబట్టి , వాళ్లకి ప్రతీ విషయం అర్ధం అయ్యేలా చెప్పండి. కధలో పక్షి తల్లి కూడా అదే తప్పు చేసింది ... బయటకు వెళ్లొద్దు అని చెప్పింది కానీ , వెళితే  ప్రమాదం అని చెప్పకపోవటం వల్ల..... పక్షికి బయటకి వెళ్లాలనే కోరిక కలిగింది , వెళ్ళింది . అలాగే బయట ప్రపంచం కూడా పక్షిని ఆకర్శించింది, తిరిగింది. ప్రమాదానికి గురైంది.  ఎక్కువ ఆకర్షణ ఉన్నదగ్గరే , ఎక్కువ ప్రమాదం ఉంటుందని ఆ వయసులో ఎవరికీ తెలియదు. కాబట్టి , పిల్లలకు  అర్థమయ్యేలా ప్రతీ విషయాన్నీ చెప్పాలి . లేకపోతే ఈ పక్షి విషయంలో జరిగినట్లే జరుగుతుంది. కాబట్టి , "పిల్లలని పెద్దలు.. పెద్దలని పిల్లలు అర్ధం చేసుకొని ఆనందంగా ఉంటారని ". ఈ చిన్న సందేశం.
 

మరిన్ని శీర్షికలు
flash flash