Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope  february 2nd to february 8th

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

 

విజయలక్ష్మి: పెళ్ళి చూపులప్పుడు కీర్తన పాడమంటే, భయమేసి పాడలేదా? ఎందుకూ?
రాజ్యలక్ష్మి: ఎలా పాడనూ? ఆ పెళ్ళికొడుకు, శంకరాభరణం శంకర శాస్త్రిని తన వెంటేసుకొచ్చాడు!

 

 

**********

సత్యవంతుడు: భార్యామణీ... నాకు నిద్ర వస్తోంది. కళ్ళు మూసుకుపడుకుని, ఒక కునుకు తీసేదా?
సతీసావిత్రి: వొద్దు స్వామీ! మీరు కళ్ళు మూసుకుని పడుకుంటే ,  ఆ దృశ్యం, భరించలేను!!

 

 

 

******

ప్రేటో: మీ వినోదం కోసం నాలుగు ఆటవస్తువులు పంపిస్తాను!
సురేంద్రవర్మ: ఇది గ్రీకు సామ్రాజ్యం కదా! అతిధులను ఆటవస్తువులతో సత్కరిస్తారు!
వీరేంద్ర వర్మ: ఆటవస్తువులంటే?
సురేంద్రవర్మ: స్త్రీలు!!

 

 

*****

 

ఒకటో ఉడత: జంతు జాలం లో మన జాతికి మహా పిరికిపోతులం అనే పేరుంది గదా! ఐతే మన రాజు, " వీర విజయసిం హ భూపాలుడు" అని పేరు మార్చుకున్నాడే?
రెండో ఉడత: పేరులో నైనా తన దర్పం ప్రదర్శించాలని!!

 

 

 

*****

సురేఖ: నీ వొంటి నిండా బంగారు నగలతో అలంకరించుకున్నావే? ఎవరన్నా చూస్తే నిన్నమాంతం ఎత్తుకుపోగలరు జాగ్రత్త!!
శ్రీలేఖ: ఎవడైనా ఆ పని చేస్తాడా అని ఎదురుచూస్తున్నాను!
మా తండ్రి వాలకం చూస్తే, నాకీ జన్మలో పెళ్ళిచేయడనిపిస్తోంది!!

 

 

 

*****

ఒకటో కుప్పతొట్టి: పుట్టబోయేది మగబిడ్డా? ఆడపిల్లా?   
రెండో కుప్పతొట్టి: ఆడపిల్లయితే మనకిచ్చేసి వెళ్తుంది! మగపిల్లాడు పుడితే ఎవరికైనా అమ్మేసి వెళ్ళిపోతుంది!! మామూలేగా!!

 

 

*****

 

గంధర్వుడొకడు: మన లోకానికి కొత్తగా వచ్చిన నారీమణులు, మొగలి పూలరేకులు జడల్లో తురుముకుని గుబాళిస్తూ, నెత్తిన మణులు ధరించి కాంతులు వెదజల్లుతున్నారే... ఎవరు వాళ్ళు?
గంధర్వుడు మరొకడు: నాగ కన్యలు!!

 

 

*****

కిష్కిందలో ఒక పక్షి: ఇన్ని వందల మర్కటాల గొలుసు! దేన్ని లాగుతున్నాయ్?
ఇంకో పక్షి: అంగదుడు కాలుమోపి, కదిలించండీ చూద్దాం ... అన్నాడట!!

 

 

 

******

మంత్రి మల్లన్న: మహా రాజా, మన సామంత రాజు కోశాగారం నల్ల ధనం తో నిండి ఉబ్బిపోయింది!
రాజు రంగన్న: అతడు మనకి సుంకం సకాలానికి చెల్లించక పోగా, కోశాగారాన్ని నింపుకున్నాడా? ఆ నల్ల ధనాన్ని కొల్లగొట్టుకు రండి!
మంత్రి మల్లన్న: కొల్లగొట్టి సంచులు , సంచులు ధనం తెచ్చాం! ఐతే  అవన్నీ సీసం నాణేలు ప్రభూ! దమ్మిడీకి ప్రయోజనం లేదు!!

******

ఒకటో కిన్నెరుడు: తిలోత్తమ , పాముల నరసయ్య గారిని వెంట తీసుకు వెళ్తున్నదే?
రెండో కిన్నెరుడు :తపస్సు చేస్తున్న ఋషి చుట్టూ పుట్టలెదిగాయి. ఆ పుట్టల్లో నాగుపాములు చేరి బుసలు కొడుతున్నాయట!!

 

.

మరిన్ని శీర్షికలు
captionless cartoon compitetion