కావలిసిన పదార్ధాలు: బియ్యం (నానబెట్టినవి), పెసరపప్పు (నానబెట్టినవి) , ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చినచెక్క, ఉప్పు, కొత్తిమీర
తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, దాల్చినచెక్క, లవంగాలు వేసి కలిపి నానబెట్టిన బియ్యాన్ని, పెసరపప్పును వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోసి ఉప్పు, పసుపు వేసి కలిపి ఉడకనివ్వాలి. 10 నిముషాలలో ఉడికుతుంది. చివరగా కొత్తిమీర వేయాలి. అంతేనండీ..అతి సులువుగా వేడి వేడి దాల్ కిచిడీ..రెడీ...
|