'జోరు' సినిమాతో తెరంగేట్రం చేసిన బ్యూటీ రాశీఖన్నా. యాక్టింగ్ టాలెంట్‌తో పాటు సింగింగ్ టాలెంట్‌తోనూ ఆకట్టుకుందీ బ్యూటీ. తాజాగా 'తొలిప్రేమ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందీ ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మకి 'ఊహలు గుసగుసలాగే' సినిమా తర్వాత అంతగా ఆకట్టుకున్న లవ్‌స్టోరీ 'తొలిప్రేమ' అంటోంది. 'తొలిప్రేమ' టైటిల్‌లో ఉన్న మ్యాజిక్ అది. అయితే ఈ బ్యూటీ కొన్ని బ్యూటీ టిప్స్ చెబుతోంది వినేద్దామా. ఫుడ్ అంటే తనకెంతో ఇష్టమంటోంది రాశీఖన్నా. కానీ హీరోయిన్ అంటే ఫిజిక్ కంట్రోల్డ్‌గా మెయింటైన్ చేయాలి. సో ఏది పడితే అది తినకూడదనే ఆంక్షలు ఉంటాయి కానీ ఈ ముద్దుగుమ్మ మరి ఏం చేస్తుందబ్బా అనుకుంటున్నారా?
రాశీఖన్నా చెప్పేదేంటంటే, మనం తీసుకునే ఫుడ్‌కీ, పెరిగే బరువుకీ అస్సలు సంబంధం ఉండదంటూ కొత్త మీనింగ్ చెబుతోంది. నమ్ముతారా? అవునండీ నిజమంట. ఈ అమ్మడు అస్సలు డైట్ కంట్రోల్ చేయదట. కానీ.. జిమ్‌లో ఎక్కువ టైం కేటాయిస్తుందట. రాశీకి ఐస్‌క్రీమ్స్, స్వీట్స్ అంటే చాలా ఇష్టమట. అవేగా కొవ్వును విపరీతంగా పెంచేసే ఐటెమ్స్. అయితే వాటిని తనకు నచ్చినట్లుగానే తినేసి, జిమ్‌లో బాడీని కష్టపెడుతుందట. దాంతో బ్యాలెన్స్ అయిపోతుందనీ సింపుల్‌గా చెప్పేస్తోందీ ముద్దుగుమ్మ. మరి మీరు కూడా ట్రై చేసి చూస్తారా ఇలా..! ఇది సరే అమ్మడు ప్రస్తుతం తెలుగులోనే కాదు, తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. మలయాళంలో రాశీఖన్నా నటించిన ఓ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగు విషయానికి వస్తే, ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే రెండు సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ మరో రెండు కొత్త సినిమాలకు సైన్ చేసింది. అదీ సంగతి.
|