Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - డా. ఎస్. జయదేవ్ బాబు

 

యమకింకరుడు - 230:  వొచ్చిన పని ముగించక పై కప్పు కేసి చూస్తున్నావేం?
యమకింకరుడు-237: ఆ బల్లి ఈ జీవుడి శిరస్సు మీద పడాలి కదా... ఆ తర్వాతేగా మన పని? అందుకే ఆగాను!

 

 

 

వ్యాసభగవానుని ఆశ్రమం లో ఒక శిష్యుడు: ఈ  తాళపత్రం మీద రాసిన అక్షరాలలో, అచ్చులు, హల్లులకు బదులు ఉండ్రాళ్ళూ, కుడుములూ వున్నాయే?
రెండో శిష్యుడు: ష్...ష్..! అవి వినాయకుడు రాసిన తాళపత్రాలు. పక్కన పెట్టి నీ పని చూసుకో పో!!

 

 

అంత:పుర పరిచారిక: ఏమేవ్... నువ్వు గోళ్ళు బాగా పెంచావే?
వింజామర కన్య: నా పని వింజామర వీచడమే కాదు.. ఒక్కోసారి రాజు గారి వీపు దురదపెట్టినప్పుడు... గోకాలి కూడా అందుకూ!!

 

 

 

 

డబ్బు శెట్టి: కలిమిలేములు - కావడి కుండల్లోని కుండలు బంగారం వా? మట్టివా?
కుమ్మరి రంగడు: మట్టివే అయ్యుంటాయ్! లేకపోతే నేనెందుకు ఇక్కడుంటానూ... నువ్వెందుకు అక్కడుంటావూ?

 

 

 

భిక్షువు: 'భవతీ భిక్షాం దేహీ' అంటూ ఈ ఆశ్రమం అంతా తిరిగాను, ఎవ్వరూ నాకు భిక్ష పెట్టలేదు!
ఇంకో భిక్షువు: నీ మీసాలూ, గెడ్డాలూ, కండలు పెంచిన ఆకారం చూసి, ఏ రావణాసురిడివో అని భయపడి వుంటారు!!

 

 

 

 

గంధర్వుడు: ఈ మధ్య ధన్వంతరి గారు చేతిలో అమృత కలశం, వనమూలికలతో పాటు, ఒక పెట్టె కూడా పట్టుకు తిరుగుతున్నారే?
కిన్నెరుడు: ఆ పెట్టెలో, స్టెత స్కోపు, ధర్మా మీటరు, బీపీ మిషను వున్నాయిలే!!

 

 

 

 

కలీమియా: పాపం చేస్తే, భగవంతుడు శిక్షిస్తాడనడానికి, ఒక మంచి నిదర్శనం చెప్పవా?
హలీమియా: ఒక విషయం... భగవంతుడెప్పుడూ కఠిన శిక్ష విధించడు! ఎంత పాపం చేస్తే, అంతే శిక్ష విధిస్తాడు!!
కలీమియా: అందుకు నిదర్శనం చెప్పు...
హలీమియా: భక్తరామదాసును, తానీషా 12 ఏళ్ళు, కారాగారం లో వుంచి శిక్షించాడు! అదే తానీషా 12 ఏళ్ళ కారాగార శిక్ష, ఔరంగాజేబ్ పాలనలో, అనుభవించాడు!!

 

 

రాజకుమారుడు: ప్రేయసీ.. నేను , నిన్ను తప్పించి, మరో ఆడ పురుగునైనా కన్నెత్తి చూడను..! నన్ను నమ్ము!!
ప్రేయసి: పచ్చి అబద్ధం. నువ్వు ఎక్కి వచ్చిన గుర్రం ... ఆడ గుర్రం!! నిన్ను నమ్మేది లేదు పో!

 

 

 

 

ఇంద్రుడు: విశ్వకర్మా... మన దేవలోకంలో ... కొన్ని భవనాలు కూలిపోతున్నాయటగా...?
విశ్వకర్మ: కర్మకాలి... నాకు దొరికిన కాంట్రాక్టర్ల వల్ల అలా  జరిగింది! ఇసుకను దొంగ రవాణా చేసి, సౌధాలు నిర్మిస్తున్నారాయే!
ఇంద్రుడు: అలాంటి పాపాత్ములను నరకానికి పంపక ఇక్కడ వాళ్ళకెందుకు పనులప్పజెప్పావ్?
విశ్వకర్మ: వీళ్ళు అక్కడి వాళ్ళే ప్రభూ! నరకం లో వీళ్ళని భరించలేక ఇక్కడికి తరిమేసి మనకంటగట్టారు దేవేంద్రా!!

 

 

ఈదురుగాలి: దుమ్ము లేపుతా!
మలయమారుతం: గుభాలింపజేస్తా!
పిల్లగాలి: కునుకు తీపిస్తా!!  

మరిన్ని శీర్షికలు
cheppagalaraa..cheppamantara