కావలిసినపదార్ధాలు: గోంగూర , ఉడికిన పప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, పసుపు
తయారుచేసే విధానం: ముందుగా గోంగూరను శుభ్రంగా కడిగి తరిగివుంచాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి అవి వేగిన తరువాత ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. తరువాత తరిగిన గోంగూరను వేసి కలిపి సరిపడినంత ఉప్పును వేసి 5 నిముషాలు మూత వుంచాలి. తరువా ఉడుకుతున్న గోంగూరలో ఉడకబెట్టిన పప్పును వేసి కలిపి కొద్దిగా చింతపండును వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. గుమగుమలాడే గోంగూర పప్పు రెడీ..
|