'డీజె' సినిమా బెడిసి కొట్టడంతో పూజా హెగ్దే పనైపోయిందనుకున్నారంతా. కానీ అనూహ్యంగా పూజా పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతోందిప్పుడు. సైలెంట్‌గా ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. అవి కూడా స్టార హీరోల సరసన కావడం విశేషం. 'డీజె' తర్వాత 'సాక్ష్యం' సినిమాలో నటిస్తోంది పూజా హెగ్దే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇదిలా ఉంటే, ప్రస్తుతం స్టార్ హీరోలందరినీ ఏకకాలంలో చుట్టేస్తోందీ అందాల గోపికమ్మ. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలో మొదట్లో అనూ ఇమ్మాన్యుయేల్‌ని హీరోయిన్‌గా అనుకున్నారు. ఆ తర్వాత ఆ ఛాన్స్ పూజా చేతిలో వచ్చి పడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి ఫాస్ట్ బీట్ స్టెప్పులేయడానికి పూజా రెడీ అయిపోతోంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. ఈ సినిమా సంగతిటుంచితే, ప్రబాస్ 'సాహో' సినిమా తర్వాత రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకీ పూజా హెగ్దేనే హీరోయిన్‌గా ఎంచుకున్నారనీ తెలుస్తోంది. ప్రబాస్ కటౌట్‌కి పూజా అయితే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. విభిన్నమైన లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులే కాదు, ఈ ముద్దుగుమ్మ అసలు సిసలైన బిగ్ ప్రాజెక్ట్‌నీ కొట్టేసింది.
అదే సూపర్‌స్టార్ మహేష్‌బాబు చిత్రం. కొరటాలతో 'భరత్ అనే నేను' సినిమాలో నటిస్తున్న సూపర్ స్టార్ మహేష్‌బాబు తర్వాతి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇటీవలే పూజా హెగ్దేని కన్‌ఫామ్ చేశారు. ఆ రకంగా ఈ బ్యూటీ మూడు బిగ్ ప్రాజెక్టులను చేజిక్కించుకుంది. ఇవన్నీ ఒకెత్తు కాగా, ఈ నెలాఖరుకు భారీ అంచనాలతో విడుదలవుతోన్న రామ్‌చరణ్ - సుకుమార్ కాంబినేషన్ 'రంగస్థలం'లో పూజా హెగ్దే నటించిన స్పెషల్ సాంగ్ ఓ స్పెషల్ అట్రాక్షన్. అదీ సంగతి. ఇంతమంది స్టార్ కృష్ణుల్ని ఒకేసారి లైన్‌లో పెట్టేసింది మన మెగా గోపికమ్మ.
|