ఏదో ఒక సినిమా చేసేసి ఇండస్ట్రీలో ఉన్నామనిపించుకోవడం కాదు. చేసినవి తక్కువ సినిమాలైనా కానీ, మంచి సినిమాలై ఉండాలి అంటోంది ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. అందుకే తాను ఎంచుకునే కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాననీ చెబుతోందీ అందాల భామ. 'ప్రేమమ్' సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. 'శతమానం భవతి' సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. ఎక్కువగా ప్రచారంలో లేకపోయినా, అమ్మడి చేతిలో ప్రస్తుతం ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే ఉన్నాయ్. కరుణాకరన్ దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. అలాగే 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాలో యంగ్ హీరో రామ్‌తో హాఫ్ లెంగ్త్ రోల్ పోషించిన అనుపమా ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటిస్తోంది.
'హలో గురూ ప్రేమకోసమే..' అనే టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. ఇక సక్సెస్‌లతో దూసుకెళ్తోన్న నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న 'కృష్ణార్జున యుద్దం' సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మే హీరోయిన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ చిత్రం. నాని ద్విపాత్రాభినయంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా, అందులో ఓ హీరోయిన్‌గా అనుపమా నటిస్తోంది. తెలుగు ప్రేక్షకుల నుండి తనకి ఇంత గొప్ప అభిమానం దక్కినందుకు తెలుగు ఆడియన్స్ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాననీ అనుపమా చెబుతోంది. తనపై ఇంత అభిమానం, ప్రేమ చూపిస్తున్న అభిమానుల కోసం వారిచే శభాష్ అనిపించుకునే మరిన్ని మంచి సినిమాల్లో నటిస్తానంటోంది.
|