Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rates

ఈ సంచికలో >> శీర్షికలు >>

8-6-2018 నుండి 14-6-2018 వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : వారం మొత్తం మీద చర్చల్లో పాల్గొనే విషయంలో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంశలు పొందుతారు. అధికారులతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేస్తారు. నూతన ప్రయత్నాలకు ప్రాముఖ్యత ఇస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులు పొందుటకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. స్థిరాస్తికొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడేలా మీ ప్రయత్నాలు చేయుట మంచిది.

 

 

 వృషభ రాశి : వారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన పనులకు సమయం కేటయించుట వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న విషయాల్లో మీ ఆలోచనల్లో స్పష్టత ఉండుట వలన లబ్దిని పొందుతారు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. రుణపరమైన విషయాల్లో కాస్త ఆలోచించి ముందుకు వెళ్ళండి. మానసికంగా ఒత్తిడికి గురయ్యే ఆస్కారం ఎక్కువగా కలదు, దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి గుర్తింపును పొందుతారు. చర్చల్లో మీ ఆలోచనలు బయటపెడుతారు.

 

 



మిథున రాశి : వారం మొత్తం మీద నూతన ఆలోచనల కన్నా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది.  స్త్రీ పరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. రావాల్సిన ధనం కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. సంతానం గురుంచి అనవసరమైన ఆలోచనలకు అలాగే ఆందోళనకు అవకాశం ఇవ్వకండి. జీవితబాగస్వామితో ఊహించని విధంగా మనస్పర్థలు వచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న నూతన సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, తొందరపాటు ఆలోచనలు కూడదు..  

 

 

కర్కాటక రాశి : వారం మొత్తం మీద కుటుంబంలో కీలకమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి అందకపోవడం వలన ఇబ్బందులు పొందుతారు. జీవితభాగస్వమిటో కలిసి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కోల్పోయే ఆస్కారం ఉంది, కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మిత్రులతో మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మంచిది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. 

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తం మీద కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మిత్రులతో ఊహించని విధంగా విభేదాలు ఏర్పడే ఆస్కారం ఉంది , కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు . నూతన అవకాశాలు లభిస్తాయి. సోదరులతో చేపట్టిన చర్చలు మిశ్రమ ఫలితాలు కలుగజేస్తాయి. సంతానం గురుంచి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను పెద్దలనుండి బహుమతిగా పొందే అవకాశం కలదు.

 

 

 

కన్యా రాశి :ఈవారం మొత్తం మీద నూతన ఆర్థికపరమైన ఆలోచనలను కలిగి ఉంటారు. గతంల,ఓ చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. బంధువుల నుండి పూర్తిస్థాయి సహకారం పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంతానంతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది అలాగే వారి విషయంలో నూతన ఆలోచనలు చేస్తారు. కుటుంబపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకోండి.

 

 

 

తులా రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన పనులకు సమయం ఇస్తారు. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయంలో నూతన ఆలోచనలు కలిగిఉంటారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడేలా ఆలోచనలు చేయుట మంచిది. జీవితభాగస్వమితో విభేదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు పెరుగుతాయి, జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి వినోదాలకు సమయం కేటాయించే అవకాశం కలదు.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద ముఖ్యమైన విషయాల్లో ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది, పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంబపరమైన విషయాల్లో పెద్దలతో సమయాన్ని సరదాగా గడుపుతారు. విలువైన వస్తువులను నస్టపోయే అవకాశం ఉంది, కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది.

 

ధనస్సు రాశి ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కుటుంబంలో పెద్దలనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును, సర్దుబాటు విధానం మంచిది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది, వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. జీవితభాగస్వామి నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. కుటుంబంలో పెద్దలతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

 

మకర రాశి :ఈవారం మొత్తం మీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు, ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. ఉద్యోగంలో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభించుట వలన, చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నూతన ఆలోచనల కన్నా గతంలో ఆలోచన చేసిన వాటికి ప్రాధాన్యం ఇవ్వడం మేలు. ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

 

 

కుంభ రాశి :  ఈవారం మొత్తం మీద ఆరంభంలో కాస్త చికాకులు తప్పక పోవచ్చును. గతంలో మీరు చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండుటలో విఫలం చెందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. ఆత్మీయులను గతంలో మీరు కోల్పయినందనుకు తగిన మూల్యం చెల్లించుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఆదాయం ఉన్న దానికి తగ్గట్లుగా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఒప్పందాలకు ఆవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలను సైతం పట్టించుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. కుటుంబసభ్యుల నుండి ఎప్పటిలాగే ఇబ్బందులు తప్పక పోవచ్చును, సర్దుబాటు మంచిది.

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తి ఉంటుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది, అలాగే నూతన అవకాశాలు లభిస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయాలు బలపడుతాయి. వ్యాపారంలో బాగానే ఉంటుంది. మిత్రులనుండి పూర్తిగా సహకారం ఉంటుంది. సంతానం విషయంలో గాథంన్లో ఉన్న ఆందోళన తగ్గిపోయే అవకాశం ఉంది. కుటుంబసభ్యుల నుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. చర్చల్లో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది. మంచి ఫలితాలు వస్తాయి. 

 

మరిన్ని శీర్షికలు