కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, లవంగాలు, పెరుగు
తయారు చేయు విధానం:
బంగాళదుంపలను బాగా ఉడక బెట్టుకొని ముక్కలుగా కోసుకోవాలి. బాణీలో నూనె వేసుకొని, వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకోవాలి. అందులో నాలుగు లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక, బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసుకొని, బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. బంగాళదుంప ముక్కలు బాగా ఉడికాక అందులో కొద్దిగా నీరు పోసుకొని, రెండు చెంచాల పెరుగు వేసుకొని, కొద్దిసేపయ్యాక దించుకుంటే.... ఘుమఘుమలాడే ఆలూ (బంగాళదుంప) కూర్మా రెడీ!!

|