Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Smt. Dokka Seethamma biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (అక్టోబర్ 04 - అక్టోబర్ 10) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో కుటుంబంలో  తీసుకున్న నిర్ణయాల మూలాన లాభంను, సౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. మీ ఆలోచనల మూలాన తోటివారు లాభంను పొందుటకు అవకాశం కలదు. ఆది, సోమవారాల్లో చేతికి అందవలసిన సొమ్ము చేతికి అందుతుంది, ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించుట మంచిది. భోజనం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి. మోకాళ్ళనొప్పులు భాదించుటకు అవకాశం కలదు జాగ్రత్త. వారం మొత్తంమీద తలపెట్టిన పనులను సకాలంలో పూరిచేయగలుగుతారు. నూతన పనులను మిత్రుల ద్వారా లేదా పెద్దల మూలాన ఆరంభించుటకు అవకాశం ఉంది. కొంత పనులలో శ్రమను పొందుతారు. ఉద్యోగంలో సామాన్యఫలితాలు కలుగుతాయి కావున నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు.         

వృషభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఊహించని వార్తను వినే అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట మేలు. వారం మొత్తం మీద బంధుమిత్రులతో కలిసి చేపట్టిన పనుల మూలాన అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం కలదు. వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఆది, సోమవారాల్లో ఇతరులకు సహాయపడే పనులను చేపట్టుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. నూతన పనులను చేపడుతారు. మంగళ, బుధ, గురువారాల్లో చేపట్టిన పనులలో విజయాన్ని పొందుటకు అవకాశం కలదు. నలుగురిలో మీ ఆలోచనల మూలాన పేరును సంపాదించుకొనే అవకాశం కలదు. నూతన అవకాశాలు కలుగుటకు ఆస్కారం కలదు. వారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపట్టుటకు అవకాశం కలదు, నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. మిత్రులతో కలిసి చేయుపనులలో నిదానం అవసరం. చర్చలలో పాల్గొనే అవకాశం ఉంది కాకపోతే తొందరపాటు వద్దు. కుటుంబంలో నిదానం అవసరం.  

మిథున రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో పనులలో కొంత జాప్యం రావడం చేత ఆందోళనకు గురయ్యే అవకాశం కలదు. ఓర్పును కలిగి ఉండుట అనేది సూచన. ఆది, సోమవారాల్లో దూరప్రదేశాల నుండి ఇష్టం లేనివార్తను వినే అవకాశం కలదు. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త. తలపెట్టన పనులు ముందుకు సాగడంలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. మంగళ, బుధ, గురువారాల్లో మీరు పెద్దల సూచనలు పాటించుట చేత పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. కొంతమేర ఆర్ధికపరమైన విషయాల్లో సహయం పొందుతారు. వారం మొత్తంమీద నూతన ప్రయత్నాలు చేయకపోవడం ఉత్తమం. ప్రయాణాలు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. మార్గమధ్యలో చిన్న చిన్న సమస్యలు తప్పకపోవచ్చును. రుణముల విషయంలో సమస్యలు కలుగుతాయి మాటపడవలసి వస్తుంది. అకారణంగా ఏర్పడు కలహముల పట్ల తగిన విధంగా మెలగడం సూచన. అధికారులతో నిదానంగా వ్యవహరించుట సూచన.
 

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో అనుకూలంగా ఉంటుంది కాకపోతే గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట శ్రేయస్కరం. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ఆది, సోమవారాల్లో ప్రయాణాల మూలాన ఇబ్బందులు పొందుతారు. చేపట్టిన పనులు మధ్యలో ఆగిపోతాయి. మానసిక సమస్యలు తప్పకపోవచ్చును. మంగళ, బుధ, గురువారాల్లో అశుభవార్తను వినే అవకాశం కలదు జాగ్రత్త. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. తలపెట్టిన పనులను అసంపూర్తిగా వదిలివేసే అవకాశం కలదు కావున పెద్దల సూచనల మేర నడుచుకోండి. వారం మొత్తంమీద బంధువులతో అధికమైన సమయాన్ని గడుపుతారు అదేవిధంగా ఆలోచనలు అదుపులో ఉంచుకోవడం మంచిది. వాహనముల విషయంలో జాగ్రత్త.  వాటి మూలాన ఖర్చు పెరుగుతుంది. మాత్రుసంబందమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేస్తారు. ధార్మిక సంబంధాలకు సమయాన్ని ఇవ్వడం ఒకింత మేలుచేస్తుంది. భోజనం విషయంలో ప్రత్యేకశ్రద్ద ఉంటుంది. 
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో నిదానం అవసరం.  నూతన ప్రయోగాలు చేయకండి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి.  తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. ఆది, సోమవారాల్లో నూతన వస్త్ర లాభంను పొందుతారు.  అదేవిధంగా సమయాన్ని అనుకూలంగా వాడుతారు. ఆర్థికపరమైన లాభం ఉంటుంది. ఉద్యోగపరమైన విషయాల్లో తోడ్పాటు ఉంటుంది. మంగళ, బుధ, గురువారాల్లో నూతన ప్రయత్నాలు వాయిదా వేయుట ఉత్తమం. పనులను పూర్తిచేయుట యందు శ్రద్ధను కల్గి ఉండుట మేలు. బంధువులతో మాటపట్టింపులు కలుగుటకు ఆస్కారం కలదు.  నిదానంగా వ్యవహరించుట సూచన. వారం మొత్తం మీద నూతన పనులను ఆరంభించక పోవడం సూచన. స్నేహితుల మూలాన చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంలో వ్యక్తుల మధ్య మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం ఉంది. అధికారులతో నిదానంగా వ్యవహరించుట సూచన. సౌఖ్యజీవితం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.  ఆదిశగా అడుగులు వేస్తారు. కుటుంబంలో మార్పులు తప్పవు.

 

కన్యా రాశి
ఈవారం మీరు ధనంకు సంభందించిన విషయాల్లో లాభంను పొందుతారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. నూతన పనులను చేపడుతారు. ఆది, సోమవారాల్లో వ్యాపారంలో ఆచితూచి వ్యవహరించుట సూచన. ఇతరులకు ఋణములు ఇచ్చే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండుట సూచన.  సమయనికిభోజనం చేయుట, అందుకు ప్రాముఖ్యతను ఇచ్చుట మంచిది. మంగళ, బుధ, గురువారాల్లో ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ముందడుగు వేయుటకు అవకాశం కలదు. వారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం ఉత్తమం. ప్రతిపనిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయుట వలన మేలుజరుగుతుంది. సంచారం చేయుట మూలాన అలసిపోతారు. మంచివారితో పరిచయాలు పెంచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఉద్యోగంలో మాములుగా ఉంటుంది. కుటుంబంలో నూతన పనులకు శ్రీకారం చుడుతారు. 

తులా రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకోని ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది. శారీరక శ్రమను కలిగి ఉంటారు.  పనిభారం ఉంటుంది. ఆది, సోమవారాల్లో బంధువులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు.  వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. మంగళ, బుధ, గురువారాల్లో తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటకు అవకాశం కలదు. ప్రయత్నం చేయుట ద్వార విజయాన్ని సొంతం చేసుకొనే అవకాశం ఉంది. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. వారం మొత్తం మీద సంతోషకరమైన వార్తను వినే ఆస్కారం కలదు. స్థానచలనం కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. క్రయవిక్రయముల మూలాన లాభం ఉంటుంది. గృహం విషయంలో ప్రత్యేకమైన ఆలోచనలు కల్గి ఉండే అవకాశం ఉంది. దేహసౌఖ్యంను పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు ఆరంభించుట మంచిది.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్ర, శని వారాల్లో బంధువులతో కలిసి చేపట్టిన పనులలో లాభంను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు కలుగుతాయి కాకపోతే కొంత నిదానం అవసరం. ఆది, సోమవారాల్లో అనుకోని ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు, తద్వార ఖర్చులు కలుగుతాయి. ప్రయాణాలలో కూడా స్వల్ప సమస్యలు తప్పక పోవచ్చును. ఆలోచనలు పెరుగుతాయి వాటి మూలాన మానసికంగా ఇబ్బందులు పొందుతారు. మంగళ, బుధ, గురువారాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వారితో కలిసి కొత్త కొత్త విషయల పట్ల ఆలోచన కలిగి ఉంటారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది ధనలాభం కలుగుతుంది. ఉత్సాహంను కలిగి ఉండి పనులలో సమయాన్ని గడుపుతారు. వారం మొత్తం మీద అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన పనులు ముందుకు కదులుతాయి. శుభాకార్యములలో సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. సమయానికి మాత్రం భోజనం చేయుట మంచిది. ధనం విషయంలో పెద్దల సలహాలను గౌరవించుట మేలు.


ధనస్సు రాశి
ఈరోజు మీరు శుక్ర, శనివారాల్లో అనుకున్న సమయానికి పనులను పూర్తిచేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. నూతన పనులయందు ఆసక్తిని కలిగి ఉంటారు. ఆది, సోమవారాల్లో బంధువుల గృహంలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. గతంలో చేపట్టిన పనులకు గాను దనలాభంను పొందుతారు. మంగళ, బుధ, గురువారాల్లో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వాటిని అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులలో శ్రమను కలిగి ఉంటారు. వారం మొత్తం మీద అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన ఉద్యోగంలో తప్పక పేరును కలిగి ఉంటారు. స్థానచలనం ఉండుటకు అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో అశ్రద్ద వద్దు. బంధువులను కలుస్తారు.  వారితో కలిసి నూతన పనులను ఆరంబిస్తారు. ఇష్టమైన పనులలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు, మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. విలువైన వస్తువుల విషయంలో మాత్రం జాగ్రత్త.

మకర రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో పనులను సాధ్యమైనంత వరకు నిదానంగా ఆరంభించుట మేలు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. కుటుంబంలో సర్దుబాటు అవసరం.  అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. ఆది, సోమవారాల్లో ప్రయత్నాలలో విజయంను పొందుతారు. లాభం మొదలవుతుంది.  అర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని కలిగి ఉంటారు. బంధువుల యందు ప్రీతిని కలిగి ఉంటారు. వారికీ సహాయం చేయుటకు అవకాశం కలదు. మంగళ, బుధ, గురువారాల్లో బంధువులతో సమయాన్ని గడుపుతారు. నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో తప్పక లాభం ఉంటుంది. వారం మొత్తంమీద అనుకోని ఖర్చులు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త. వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలలో అలాగే వాహనములు నడుపుట మూలాన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది జాగ్రత్త. పనులలో అశ్రద్ద మూలాన ఆలస్యంగా మొదలు అయ్యే ప్రమాదముంది. అధికారులు ఇబ్బందికి గురిచేస్తారు. మధుర పదార్థములను భుజిస్తారు.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు పొందుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో ఇబ్బందులు తలెత్తుటకు అవకాశం కలదు. పనులు మధ్యలో ఆగిపోతాయి. ఆది, సోమవారాల్లో కుటుంబంలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది.  మీరే సర్దుబాటు విధానం అవలంభించుట వలన మేలుజరుగుతుంది. నూతన ప్రయత్నాలు కూడదు.  నిదానం అవసరం. మంగళ, బుధ, గురువారాల్లో తలపెట్టిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికంగా చాలావరకు సర్దుబాటు అయ్యే అవకాశం కలదు. ఇతరుల సహాయం మూలాన మరిన్ని పనులు ముందుకు సాగుతాయి. వారం మొత్తం మీద వ్యతిరేకవర్గం మూలాన సమస్యలు కల్గుటకు అవకాశం కలదు. ఒకవార్త మీకు భాదను కలిగించే అవకాశం ఉంది. భోజనం విషయంలో మాత్రం తప్పక శ్రద్ధను వహించాలి. పనులలో భారంను కలిగి ఉండే అవకాశం కలదు. మీ ఆలోచనలు ఒకింత మంచిని చేయుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నిదానం అవసరం. ధార్మిక పనులలో సమయాన్ని గడుపుట మేలు.    

మీన రాశి
ఈవారం మీరు శుక్ర, శనివారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ధనలాభంను కలిగి ఉంటారు. నూతన పనుల యందు ఆసక్తిని కలిగి ఉంటారు.  కాకపోతే నిదానం అవసరం. ఆది, సోమవారాల్లో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో తప్పక జాగ్రత్త వహించుట మేలు. మంగళ,బుధ,గురువారాల్లో ఉద్యోగంలో స్వల్పంగా పనిభారం పెరుగుటకు అవకాశం కలదు. అందరిని కలుపుకి వెళ్ళుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. వారం మొత్తం మీద చేపట్టిన పనులలో ఉత్సాహంను పెంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. నూతన విషయాల యందు ప్రత్యేక దృష్టిని కలిగి ఉంటారు. సమయానికి భోజనం పనిఒత్తిడి మూలాన చేయలేకపోయే అవకాశం కలదు. ప్రయాణాలకు సమయాన్ని కేటాయించే అవకాశం ఉంది. ధార్మికసంభందమైన విషయాల కోసం సమయాన్ని కేటయించుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయి.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
article on free