Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kaakoolu by Sairam Akundi

ఈ సంచికలో >> శీర్షికలు >>

నవ్వుల జల్లు - జయదేవ్

సోమనాధుడు : ఏనుగు తోక వెంట్రుక పీకి ఉంగరానికి చుట్టుకుంటే అదృష్టం వరిస్తుందట! అది నిజం కాదు!!
రామనాధుడు : ఎందుచేత?
సోమనాధుడు : నాకు కట్నంతో పిల్లనిచ్చి పెళ్ళి చేస్తానన్న మా మామ మాట మార్చాడు! నేను నచ్చలేదట పిల్లకి!
రామనాధుడు : ఎందుకు నచ్చలేదు?సోమనాధుడు : నా పళ్ళూడి నా మొహం వికారంగా మారిందిగా?
రామనాధుడు : అదే... ఎందుచేత పాపం?
సోమనాధుడు : ఏనుగు తోక వెంట్రుక పీకుతున్నప్పుడు, అది తన్నింది!!

పాము అమ్మాయి : నేను ఆ అబ్బాయినే చేసుకుంటాను నాన్నా!
పాము తండ్రి : అది కుదర్దమ్మా! మనం పుట్టపాములు, కోరలుంటాయి! వాళ్ళు బుట్ట పాములు, కోరలు తీసేసిన పాములు!!
పాము అమ్మాయి : అందుకే, చేసుకుంటాను నాన్నా! నా చెప్పు చేతల్లోవుంటాడు గదా!!

ఒక ఈగ : ఆ సినిమా వీర ప్లాపటగా?
మరో ఈగ : ఔను! నిన్న నేనూ మా ఫ్రెండ్సూ కలిసి వెళ్ళాం! ఆ సినిమా హాలు వాళ్ళకి మమ్మల్ని తోలడానికే సరిపోయింది!!

వీధి కుక్క : నిన్ను చూసి చాల్రోజులైంది! పైగా, బాగా చిక్కి సన్నబడిపోయావ్
గాడిద : తిండి బాగా తగ్గిపోయింది! వీధి వీదికీ, గోడల మీద " పోస్టర్లంటించరాదు" అని రాసి పెట్టారు, ప్చ్!!

చారల గుర్రం పెళ్ళాం : మనకి పిల్లాడు పుట్టాడు, మీకు సంతోషంగా లేదా?
చారల గుర్రం మొగుడు : సంతోషానికేం గానీ, నీ మీదే అనుమానమొచ్చింది! పిల్లాడికి చారలు లేవు, చుక్కలున్నాయ్!!

బావి కప్ప పిల్లాడు : నాన్నా! మంచి వార్త. బోర్ పంపు చెడిపోయింది. బావి నీరు తరగదు!!
బావి కప్ప నాన్న : బోర్ పంపును రిపేర్ చేయిస్తారు! ఆ తర్వాత?
బావి కప్ప పిల్లాడు : కరెంటు సప్లై కూడా ఆగిపోయింది, రిపేర్ చేసినా లాభం లేదు!!
బావి కప్ప నాన్న : ఐతే సెలిబ్రేట్ చెయ్యాల్సిందే!!


పుచ్చుపురుగు - 1 : నోరు, వంకర పెట్టావ్, ఏవైందీ?
పుచ్చుపురుగు - 2 : వంకాయ భలే చేదుగా వుంది... వ్యాక్!!


గూటి చిలుక : అయ్యో పాపం, మీ యజమానురాలు, నిన్ను చితక బాది, రెండ్రోజులు తిండిపెట్టక మాడ్చిందా? ఏం చేశావ్?
పంజరం చిలుక : వాళ్ళాయన, గోడకు తగిలించిన చొక్కాలోంచి డబ్బు కాజేసింది!
గూటి చిలుక : ఆ సంగతి వాళ్ళాయనతో చెప్పావ్... ఔనా?
పంజరం చిలుక : ప్ ఛీ... వాళ్లత్తతో చెప్పాను!!


నీటి గుఱ్ఱం అమ్మాయి : నాన్నా... నేను స్నానం చేస్తుంటే తొంగి చూస్తున్నాడు నాన్నా!
నీటి గుఱ్ఱం తండ్రి : ఎవడు వాడు, వాడి కళ్ళు పొడిచేస్తాను!
నీటి గుఱ్ఱం అమ్మాయి : నీ వల్ల కాదు నాన్నా, వాడ్ని తరిమి పట్టుకోనూ లేవు, వాడి కళ్ళు పొడవా లేవు! వాడు జిరాఫీ నాన్నా!!


క్రిష్ణ బొచ్చె - 1 : మనం త్వరలో ఏ పులుసులోనో తేల బోతున్నాం! ఏ నూనెలోనో వేగ బోతున్నాం! ప్చ్!
క్రిష్ణ బొచ్చె - 2 : పిచ్చిపిచ్చిగామాట్లాడకు! ఏవైందనీ?
క్రిష్ణ బొచ్చె - 1 : మనం వలలో చిక్కుకున్నాం బ్రదర్!!

మరిన్ని శీర్షికలు
aloo kurma