Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జోకులు - డా. ఎస్. జయదేవ్ బాబు

 

 

నల్ల పేడ పురుగు : మిత్రమా ఏమిటీ విడ్డూరం? ఉన్నట్టుండీ ఇలా " మంచు " లా తెల్లబడి పోయావే ?
తెల్ల పేడ పురుగు : ఐరావతం పేడ రుచిగా వుందని తిన్నాను ! ఇలా ఐపోయాను .

 

ఒక మండూకం : మన కొలనులో , నిన్న మొన్నటి దాకా , నోర్లు మూసుకుని అందరూ ఓ చోట పడి ఉన్నామే ?
రెండో మండూకం : ఔను, తాళం కప్పలొచ్చి చేరాయిగా...
మూడో మండూకం : వున్నట్టుండి , కొలనంతా గొడవ గొడవగా మారిందే ?
నాలుగో మండూకం : కొత్తగా తక్కెడ కప్పలొచ్చాయి.. నువ్వు చూళ్ళేదా ?

 

చేప యువకుడు : కొత్తగా కనిపిస్తున్నావ్...ఇంతకు ముందు నిన్నెప్పుడూ చూళ్ళేదే ?
చేప యువతి : నేను వాన చేపని, ఆ మధ్య పడిన చేపల వానలో , నేనో పొలంలో పడి, అక్కణ్ణుంచి కొట్టుకొచ్చి ఇక్కడ చేరాను!
చేప యువకుడు : ఏమోగానీ, నిన్ను చూస్తే మత్తీక్కి పోతోంది!!
చేప యువతి : నేను పడిన ఆ పొలంలో గంజాయి మొక్కలు పెంచార్లే !!

ఒక నాగుపాము : పగబట్టి, ఆ సుబ్బిశెట్టిని కాటేశావు గదా...ఆ శెట్టి చావలేదేం ?
మరో నాగుపాము : పీరు సాయిబు , పాము మంత్రమేసి శెట్టిని బతికించాడు !
ఒక నాగు పాము : ఐతే నీ పగ సంగతో ? శెట్టిని ఇంకోసారి కరుస్తావా?
మరో నాగుపాము : పీరు సాయిబును కాటేయడానికి బయల్దేరుతున్నాను !

 

ఆడ కృష్ణ జింక : కొమ్ములు తిరిగిన మొనగాడివని, ఏరికోరి నిన్ను వరిస్తే, తీరిక లేదని తప్పుకుంటావా ?
మగ కృష్ణజింక : నామీద చంద్రుడు స్వారీ చేస్తున్నాడు చూశావ్ గా....ఆయన దిగందే నాకు తీరికెక్కడిదీ ?
ఆడ కృష్ణజింక : సరే, ఆయన దిగేదెప్పుడు?
మగ కృష్ణజింక : గ్రహణం పట్టేదాకా ఆగాలి మరి !!

 

 

తాబేలు పులితో : కామోద్దీపన కోసం నిన్ను చంపి నీ మాంసం తినాలని ఈ దేశపు రాకుమారుడు పట్టుబట్టాడా?
పులి : ఔను ! ఐతే, అతడు నన్ను చంపే ప్రయత్నం విరమించేలా చేసేశాను !
తాబేలు : ఎలా ?
పులి : ఏముందీ...రాకుమారుడు ప్రేమించిన యువరాణిని నేను చంపి తినేశాను !

 

మంత్రి : మహారాజా, మనదేశ ప్రజలందరూ మహాసంపన్నులయ్యారని వార్త వచ్చింది !
రాజు : ఆ(..! నేను సంపన్నుడిని కాకుండ, బికారిగానే ఉన్నానే ?
మంత్రి : ప్రజలందరూ నవరత్న ఖచిత తాబేలు ఉంగరాన్ని ధరించారు ప్రభూ ! మీరూ ఒక తాబేలు ఉంగరం ధరించండి !
రాజు : అఖ్ఖర్లేదు , మన రాజ్యంలోని అన్ని తాబేలు వుంగరాలని వేళ్ళతో సహా కత్తిరించి మన కోశాగారంలో పడేయ్...! నా మాటే శాసనం పో !!

 

పిచ్చుక నెమలితో : నెమలి మిత్రమా , నువ్వు రాజుగారు పెంచుకునే ఏకైక నెమలివి కదా...నీ శరీరంలో ఈకలూ, పింఛాలు ఏమైనాయి ?
నెమలి : మూడు నెమలి పింఛములు తీసుకుని నలుపు దారం కట్టి, వక్కపొడి, నీళ్ళు చల్లి, శని భగవానుడ్ని ప్రార్ధిస్తే, శని దోషం పోతుందని రాజుగారి నమ్మకం.
పిచ్చుక : మూడు నెమలి పింఛాలే కదా..?
నెమలి :ఈ అంత:పురంలో అందరికీ శని దోషం పట్టుకుంది మరి !...నా ఖర్మ కాలి ...!!

 

నల్ల పావురం : ఈ పావురాన్ని నేనెప్పుడూ చూళ్ళేదే? చచ్చి పడుందే?
తెల్లపావురం : తను ఖుతుబ్ షాహీ కాలం నాటి పావురం అని చెప్పింది. ఆకలిగా వుంది తినడానికి గింజలేమైనా దొరుకుతాయా అనడిగింది. మనం తినే గింజలు చూపించాను. తిన్నది. వెంటనే చచ్చింది.
నల్ల పావురం : ఐతే అది పాత కాలం నాటి పావురమే...సందేహం లేదు!

 

ఒక కాకి : ఈ నగరంలో అన్ని శిలావిగ్రహాలున్నాయి. ఐతే ఒక్క దానిమీద కూడా వాలి రెట్ట వేయలేకపోతున్నానని బాధగా వుంది.
కోతి : ఏం? ఎందుకు ఆశిలల మీద కూర్చోలేవు?
కాకి : అన్ని శిలావిగ్రహాలకీ బంగారు పూత పూయించారుగా!!

మరిన్ని శీర్షికలు
betala prashna