Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
thailand

ఈ సంచికలో >> శీర్షికలు >>

20-4-2018 నుండి26-4-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద ఎవ్వరితోను మాటపట్టిపులకు పోకండి. నలుగురిలో పనిచేసే సమయంలో అవతలి వారిసూచనలు పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న విషయాలకే కాస్త చికాకు పడే అవకాశం కలదు. మీయొక్క మాటలు మీ మిత్రులను భాధకు గురిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించుట ఉత్తమం. కుటుంభంలో భాద్యతలు పెరుగుతాయి వాటికి అనుగుణంగా ఆలోచనలు చేయండి. తల్లితరుపు బంధువుల నుండి నూతన సమాచరం లభిస్తుంది. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి. వీటి విషయంలో తెలివైన నిర్ణయం తీసుకొనే ప్రయత్నం చేయండి.    
  

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద చేపట్టిన పనులలో ఒత్తిడి ఉంటుంది. నిదానంగా ప్రణాలిక కలిగి ఉండి ముందుకువెళ్ళుట వలన లబ్దిని పొందుతారు. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి. తలపెట్టిన పనులను నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టె ముందు పెద్దలతో చర్చలు చేయుట అన్నివిధాల మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యుల నుండి మీయొక్క ఆలోచనల విషయంలో కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశం కలదు సర్దుబాటు అవసరం. విలువైన వస్తువుల విషయంలో ఏమరపాటు ఉంటె నష్టపోయే అవకాశం కలదు జాగ్రత్త.

 



మిథున రాశి : ఈవారం మొత్తంమీద నలుగురిలో మీ ఆలోచనల మూలాన చక్కటి గుర్తింపును పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించిన దానికన్నా అధికమైన ఖర్చులను పొందుతారు. స్త్రీ / పురుష సంబంధమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనుల మూలాన ఒత్తిడిని పొందుతారు. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అనవసరమైన చర్చలకు అవకాశం ఇవ్వకపోవడం అనేది సూచన. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది.

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఉత్సహంగా పాల్గొనేఅవకాశం ఉంది. తండ్రితరుపు బంధువుల నుండి చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సర్దుబాటు విధానం అలాగే నలుగురిని కలుపుకొని వెళ్ళడం వలన మేలుజరుగుతుంది. దైవసంభందమైన పూజలలో పాల్గొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మీయొక్క ఆలోచనలకు ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు.  

 

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండుట సూచన. నూతన ప్రయత్నాల విషయంలో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో విపరీతమైన ఖర్చులకు ఆస్కారం ఉంది. గతంలో తలపెట్టిన పనులను ఇతరుల సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో స్బహ్యుల నుండి కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో కలిసి కొత్త కొత్త పనులను ఆరంబ్చుటకు ప్రణాళికను సిద్దం చేసుకొనే అవకాశం ఉంది. మిత్రుల నుండి లేదా ఆత్మీయుల నుండి విలువైన సమాచరం అందుతుంది.

 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. తలపెట్టిన పనుల విషయంలో భాద్యత లేకపోతే కొత్త కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. నూతన ప్రయత్నాల విషయంలో మాత్రం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం మేలు. ఉద్యోగంలో బాగుంటుంది ఆశించిన మేర ఇతరుల నుండి సహకారం లభిస్తుంది. దూరప్రదేశం నుండి నూతన సమాచరం అందుతుంది. కోపాన్ని తగ్గించుకోవడం వలన వివాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయకపోవడం అనేది సూచన. కుటుంబంలో సభ్యుల నుండి వచ్చిన సూచనల విషయంలో మరొకసారి ఆలోచన చేయుట వలన మేలుజరుగుతుంది.

 

తులా రాశి :  ఈవారం మొత్తంమీద మానసిక పరమైన ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను ఆలస్యంగా నైనా విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. పెద్దలతో చేసిన సంప్రదింపులు ఊహించిన మేర ఫలితాలను ఇవ్వడం అనేది ఊరట. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. సాధ్యమైనంత వరకు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. కుటుంబంలో నూతన ఆలోచనలకు శ్రీకారం చుడుతారు.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద బంధువులతో సమయాన్ని గడుపుతారు. సంతానం నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. తండ్రితో చర్చలు చేయుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో లేక వృత్తిలో ప్రణాళిక ఉన్నచో లక్ష్యం నెరవేరుతుంది. అనవసరమైన చర్చలకు అవకాశం ఇవ్వకండి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఒత్తిడి తప్పక పోవచ్చును. కుటుంబసభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది. నూతన అవకాశాలు లభించే ఆస్కారం కలదు. వ్యాపారంలో మాత్రం నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన లబ్దిని పొందుతారు.
 

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను మధ్యలో వదిలేసే అవకాశం కలదు. అనవసరమైన ఆలోచనలకు సమయం ఇవ్వడం వలన సమయాన్ని నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త.  పెద్దలతో చర్చల్లో పాల్గొనేటప్పుడు వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. పనుల విషయంలో భాద్యత కలిగి ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు కలుగుతాయి. స్వల్పఅనారోగ్యసమస్యలు ఏర్పడే ఆస్కారం ఉంది కావున అశ్రద్ద చేయక తగిన జాగ్రత్తలు తీసుకోండి.

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. ఉద్యోగంలో చేపట్టిన పనులు సంత్రుప్రికరమైన ఫలితాలు ఇస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీయొక్క మాటతీరును మార్చుకోకపోతే నూతన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వీటికి సమయం ఇస్తారు. సామాజిక సేవకార్యక్రమాలకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. మిత్రులతో చర్చల్లో పాల్గొంటారు.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలదు. రాజకీయపరమైన విషయాల పట్ల మక్కువను కల్గి ఉంటారు. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఆలోచనలు కాస్త అదుపులో ఉంచుకోవడం వలన మేలుజరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలకు సమయాన్ని కేటాయిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది అలాగే పెద్దల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను కాస్త నిదానంగా పూర్తిచేసే అవకాశం కలదు.
 

మీన రాశి : ఈవారం మొత్తంమీద సంతానంతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది అలాగే, అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో నూతన చర్చలకు అవకాశం ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. మిత్రులనుండి నూతన సమాచరం లభిస్తుంది. విదేశీప్రయత్నాల విషయంలో పెద్దల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామితో కలిసి విందుల్లో పాల్గొనే అవకాశం కలదు.

మరిన్ని శీర్షికలు
pratapabhavalu