Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

శ్రీరెడ్డీ నాగబాబును ఏడిపించావ్‌.!

nagababu crying

అమ్మ ఎవరికైనా అమ్మే. ఆ అమ్మ గురించి ఎవరు మాట్లాడినా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. పదేళ్లుగా అమ్మకి దూరంగా ఉండడం వల్ల శ్రీరెడ్డికి అమ్మ అంత చులకనైపోయిందా? నాగబాబు స్వతహాగా స్ట్రాంగ్‌ పర్సన్‌. అలాంటి నాగబాబును శ్రీరెడ్డి ఏడిపించింది. పవన్‌ కళ్యాణ్‌ తల్లిని దూషిస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు నాగబాబును తీవ్రంగా కలచివేశాయి. అయినా భరించి, ఆడకూతురు కదా అని వదిలేస్తున్నాం అని శ్రీరెడ్డినుద్దేశించి నాగబాబు అన్నారు. అయినా కానీ అభిమానులు సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డిపై చేస్తున్న ట్రోలింగ్‌కి, అభిమానుల్ని కంట్రోల్‌ చేయలేమన్నారు నాగబాబు.

అంతేకాదు, ఓ ఆర్టిస్టువి నువ్వే కంట్రోల్‌ తప్పితే, కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్న అభిమానులు ఎలా కంట్రోల్‌లో ఉంటారు. అభిమానులకు చెప్తాం. చెబుతూనే ఉన్నాం అంతకన్నా వారి ఎమోషన్స్‌ని కంట్రోల్‌ చేయలేం. ఆడపిల్లవని వదిలేస్తున్నాం. బుద్ది తెచ్చుకో. అమ్మని గౌరవించడం నేర్చుకో అని నాగబాబు చెప్పాడు. తెలుగు సినీ పరిశ్రమలో 'కాస్టింగ్‌ కౌచ్‌' అంటూ ఉద్యమం మొదలుపెట్టిన నటి శ్రీరెడ్డి పవన్‌ కళ్యాణ్‌ని టార్గెట్‌ చేస్తూ, ఆయనపై అసభ్యకరమైన ఆరోపణలు చేసి, ఉద్యమాన్ని పక్కదోవ పట్టించింది. ఈ నేపథ్యంలోనే పవన్‌ కళ్యాణ్‌ తల్లిని దుర్భాషలాడింది. ఆ క్రమంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన నాగబాబు మీడియా ముందుకు వచ్చారు. ఆ క్రమంలోనే పై విధంగా మాట్లాడారు. అయినా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడితే, ఎక్కడ లేదు, ప్రపంచం మొత్తం, ప్రతీ రంగంలోనూ కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. కావాలని ఇండస్ట్రీపై బురద చల్లొద్దని శ్రీరెడ్డికి వార్నింగ్‌ ఇచ్చారు నాగబాబు. 

మరిన్ని సినిమా కబుర్లు
sakshyam movie become sensation