'ఎమ్మెల్యే' సినిమా తర్వాత కళ్యాణ్‌రామ్ దూకుడు పెంచాడు. 'ఎమ్యెల్యే' ఆశించిన రిజల్ట్‌ని అందించకపోయినా, నెక్స్ట్ 'నా నువ్వే' చిత్రంతో వచ్చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, తాజాగా కళ్యాణ్‌రామ్ మరో కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలకు చోటుంది. ఆల్రెడీ ఆ ఇద్దరు భామల్నీ సెలెక్ట్ చేసింది చిత్ర యూనిట్. ఆ ముద్దుగుమ్మలెవరనుకుంటున్నారా? 'జై లవకుశ'తో తమ్ముడు ఎన్టీఆర్‌తో జత కట్టిన నివేదా థామస్ ఒకరు కాగా, 'అర్జున్‌రెడ్డి' సినిమాతో పాపులర్ అయిన ముద్దుగుమ్మ షాలినీ పాండే మరొకరు. కళ్యాణ్‌రామ్‌తో నటించే ఛాన్స్ కొట్టేసినందుకు ముఖ్యంగా షాలినీ పాండే పండగ చేసుకుంటోందట.
ఇకపోతే, తమన్నా, కళ్యాణ్‌రామ్ జంటగా తెరకెక్కుతోన్న 'నా నువ్వే' సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా నుండి ఓ రొమాంటిక్ సాంగ్ వీడియో ప్రోమోని తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్‌లో తమన్నా, కళ్యాణ్‌రామ్ మధ్య కెమిస్ట్రీ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. అంతగా అదరహో అనిపిస్తోందీ ప్రోమో. వైట్ కాస్ట్యూమ్‌లో మిల్కీబ్యూటీ తమన్నా సూపర్ హాట్‌గా కనిపిస్తూనే, తన క్యూట్ గ్లామర్‌తో కట్టి పాడేస్తోంది. తమన్నాకి కళ్యాణ్‌రామ్‌తో తొలి సినిమా ఇది. ఈ ఒక్క సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. జస్ట్ టీజర్ సాంగే ఇలా ఉంటే, ఫుల్ సాంగ్ వీడియో పిచ్చెక్కించేసేలా ఉంటుందనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|