Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nagababu crying

ఈ సంచికలో >> సినిమా >>

'సాక్ష్యం' కాబోతోంది సంచలనం

sakshyam movie become sensation

శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తాజా చిత్రం 'సాక్ష్యం'. బెల్లంకొండ నటించిన గత మూడు చిత్రాలూ భారీ బడ్జెట్‌ చిత్రాలే. అలాగే ఈ చిత్రం కూడా బడ్జెట్‌ పరంగా భారీ చిత్రమే. అంతేకాదు, ఈ సినిమాకి ఆధ్యాత్మిక అంశాలను కూడా జోడించినట్లుగా టీజర్‌లో తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. కర్మ సిద్ధాంతం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఆధ్యాత్మిక అంశాలు, థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు, అన్ని రకాల కమర్షియల్‌ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు టీజర్‌తోనే స్పష్టంగా చెప్పేశారు. స్పెషల్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో పాటు, యాక్షన్‌ అంశాలు కూడా భారీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా, బెల్లంకొండ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతాయి. స్టార్‌ హీరోలకి ధీటుగా బెల్లంకొండ సినిమాలు రూపొందుతాయి. గత మూడు చిత్రాలతో పోల్చితే ఈ సినిమాని అంతకు మించి అన్న స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక టీజర్‌ పూర్తిగా చూస్తే, స్టార్టింగ్‌లో కర్మ సాక్ష్యంగా స్టార్ట్‌ అయిన టీజర్‌ చివరికి యాక్షన్‌ అంశాలు, రొమాంటిక్‌ ఎంటర్‌టైనింగ్‌ అంశాలతో ఎండ్‌ చేశారు. ఏది ఏమైనా 'సాక్ష్యం' సినిమా ఈ సారి బెల్లంకొండ కెరీర్‌లోనే ఓ సంచలనం కానుందని అనిపిస్తోంది. సమ్మర్‌ కానుకగా ఈ సినిమాని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌. అందాల భామ పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cinema actress nothing less