Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

మాంసాహారం వల్ల వత్తిడి ఇంకా నిద్రపోయే సమయం పెరిగిపోతుంది - ..

non veg can leads to excess sleep

మాంసాహారం అంటే మీరు ఆమ్ల గుణాలు కలిగిన ఆహారాన్ని తీసుకున్నారని అర్థం, దాంతో మీ శరీరం వత్తిడి అనే ఒక చక్రానికి అలవాటు పడుతుంది. మీ శరీరంలో మళ్ళీ మళ్ళీ ఇవే విషయాలు ఎక్కువ మోతాదులో జరుగుతూ ఉంటాయి. అంటే ఒక రకమైన ఆహారం తీసుకుంటే మీలో లేనిపోని కంగారు పెరుగుతుంది. ఇది పూర్తిగా అనవసరం. ఈ కంగారు పూర్తిగా మానసికమైనది కూడా కాదు. ఎందుకంటే మీ శరీరం సహజంగా తయారు చేసుకోగలిగిన ఆమ్లాలను మీరు బయటనించి అసహజంగా అందిస్తున్నారు. ఇది అవసరంలేని విషయం కదా! దీనర్థం..నేను మాంసాహారం తింటే నేను సరిగ్గా ఉండననా?. అది కాదు విషయం. కనిపించిన చెత్తంతా తిని కూడా మీరు బుద్ధుడిలా ఉండచ్చు. ఇది వీలవుతుంది. కేవలం భోజనమే నిర్ణయించే విషయం కాదు. కానీ భోజనం తాలూకు ప్రభావం మీ మీద ఉంటుంది. కాబట్టీ మీరు తిన్న భోజనం తాలూకు ప్రభావం మీ మీద ప్రతికూలంగా ఉండకోడదంటే మీరు కొంచెం ప్రజ్ఞ్యతో ఆలోచించి తినాలి. ఇది తినాలి అది తినకోడదు అని కాదు, ఎరుకతో ఏది ఎంత మోతాదులో తినాలో తెలుసుకోవాలి.

మాంసాహారం తినే విధంగా మన శరీర వ్యవస్థ తయారు చేయబడలేదని, మాంసాహారం తినడం వల్ల మానసిక వత్తిడి మాత్రమే కాకుండా నిద్ర సమయం కూడా  పెరిగిపోతుంది. మాంసాహారం తినే జంతువులు ఒకసారి తిన్నాక మళ్లి తినేందుకు కావలసినంత విరామం తీస్కుంటాయి.

మీరు శాకాహార జంతువుల శరీర లక్షణాలనూ మాంసాహార జంతువుల శరీర లక్షణాలనూ జాగ్రత్తగా గమనించినట్లైతే తెలుస్తుంది. మన శరీర తత్వం, శరీర నిర్మాణం కూడా శాకాహార జంతువుల మాదిరిగానే ఉంటుంది. మాంసాహార జంతువుల మాదిరిగా ఉండదు. మాంసాహార జంతువులు ప్రతిరోజూ తినవు. మీకీ విషయం తెలుసా? ఒక పాము ఒకసారి తిన్నాక పన్నెండు నించీ పద్దెనిమిది రోజుల దాకా మళ్ళీ తినదు. అదే ఒక పులైతే ఎనిమిది నించీ పదిహేను రోజుల వరకూ తినదు. కానీ మనం చూస్తే రోజుకి మూడుపూట్లా తింటాం. అది పూర్తిగా శాకాహారతత్త్వం. శాకాహారులు రోజంతా తింటూనే ఉంటారు..(నవ్వులు….) కదా!!. ఒక ఆవు లేదా ఏనుగునే తీస్కోండి అవి తింటూనే ఉంటాయి. ఏ సమస్యా లేదు ఎందుకంటే శాకాహారం కదా. మాంసాహారం తినే జంతువులు ఒకసారి తిన్నాక మళ్లి తినేందుకు కావలసినంత విరామం తీస్కుంటాయి. వాటి శరీర వ్యవస్థ అలా ఉంటుంది. మన శరీర వ్యవస్థ అలా చెయ్యబడలేదు. మీరొక పులిలాగా పదిహేను రోజులకొకసారి తినగలరా?. దానర్ధం ఏంటంటే పులి తినే ఆహారం తిన గలిగేలా మనం చెయ్యబడలేదనే.కదా..!!

ఇంక మన నిద్ర సమయం కూడా బాగా పెరిగిపోతోంది. మీరు మాంసాహారం తినటం మొదలుపెడితే మీరు అనవసరంగా ఎక్కువ నిద్రపోతారు. ఇందుకే పాశ్చాత్య దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్న వైద్యులు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పది గంటల నిద్ర అవసరం అని చెబుతున్నారు. ఇది పూర్తిగా తప్పుడు నిర్ధారణ. నా జీవితంలో రోజుకి నా సగటు నిద్రా సమయం రెండున్నర గంటలు లేదా మూడు గంటలు. నేను ఆరోగ్యంగానే ఉన్నానా?ఈ క్షణంలో మీరు నా నాడి చూస్తే అది సుమారు నలభైరెండు లేదా నలభైమూడు ఉండచ్చు, నా కడుపులో ఇంకా ఆహరం ఉంది కాబట్టి. అదే నేను ఆకలితో ఇక్కడ కూర్చుని ఉంటే, నా నాడి ముప్పై ఐదు నించీ ముప్పై ఎనిమిది వరకూ ఉంటుంది. అంటే నేను దీర్ఘనిద్రలో ఉన్నట్టు అనమాట- అతిదీర్ఘనిద్ర. నేను మేల్కొనే ఉన్నానా? ఏదైనా ప్రాపంచికమైన పని చేసేందుకు వీలుగా మేల్కొని ఉన్నానుగా?

కాబట్టి మీరు ఇలా ఉంటే, మీ శారీరిక వ్యవస్థ ఇలా ఉంటే, ఇక వొత్తిడి సమస్య ఏముంటుంది?. ఇక మీ జీవితంలోఆ సమస్యే ఉండదు. అసలు వొత్తిడి అనేదేమీ లేదు.

నేను రెండు రోజుల పాటు నిద్రపోకపోయినా కూడా నేను ఇలాగే ఉంటాను. నాలో ఏ మార్పూ మీకు కనిపించదు. నేను ఇలాగే ఉంటాను.ఇంతే హుషారుగా ఇంతే ఆనందంగా, ఇంతే నిమగ్నతతో. మీ జీవన ప్రక్రియ సునాయాసంగా ఉన్నప్పుడు, మీరు ఏ పనిలోనైనా లీనమవ్వగలరు. అదే మీ జీవిత ప్రక్రియ గనుక కష్టంగా ఉంటే, ఒకవేళ అది మీ జీవితానికి సంబంధించిన ముఖ్య విషయం అయినప్పటికీ మీరు దాని మీద శ్రద్ధ పెట్టలేరు, ఎందుకంటే అది శ్రమతో కూడుకొని ఉన్నది కాబట్టి. మీ జీవన ప్రక్రియ ఎంత సాఫీగా ఉంటే మీరు జీవితంలో చేసే ప్రతి చర్యాలో అంతగా లీనమవ్వగలరు. అంతే కదా?. అప్పుడు ఆ మార్పు మీ జీవితాన్ని ఆసాంతం మార్చేస్తుంది.

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని శీర్షికలు
Palakura Mamidi Pappu