Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Ye Perutho Pilichinaa | Latest Telugu Short Film 2017 | LB Sriram He'ART' Films

ఈ సంచికలో >> శీర్షికలు >>

27-4-2018 నుండి3-5-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభం బాగున్న ఇతరుల నుండి ఊహించని సమస్యలను పొందుటకు అవకాశం ఉంది జాగ్రత్త. మిత్రులతో కలిసి విందులలో పాల్గొనే ఆస్కారం కలదు. తలపెట్టిన పనులను కాస్తాఆలస్యం అయినను చివరకు పూర్తిచేసే అవకాశం కలదు. ఇష్టమైన వ్యక్తులతో సమయం గడుపుటకు ఆస్కారం కలదు వారికి మీ ఆలోచనలు తెలియజేయుటకు ఆస్కారం ఉంది. కుటుంభంలో నూతన మార్పులకు శ్రీకారం చుడుతారు కాకపోతే ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని నియత్రిన్చుకోవడంలో విఫలం అయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయకపోవడం చాలావరకు మంచిది. ఉద్యోగంలో అధికారులతో ఉన్నతమైన సంభందాలు కలిగి ఉండు విధంగా ప్రయత్నం చేయుట మంచిది.  

 

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది, ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. పెద్దలతో పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో కలిసి నాతన ఆలోచనలు చేపట్టుటకు ప్రయత్నం మొదలు అవుతుంది. నిర్ణయాల విషయంలో అందరి అభిప్రయాలను తీసుకోవడం వలన మరింత అనుకూలమైన ఫలితాలు పొందుటకు ఆస్కారం ఉంది. ఒకవార్త మీలో భాదను కలిగించే అవకాశం ఉంది మానసికంగా దృడంగా ఉండుట సూచన. ఉద్యోగంలో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరిచుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు చేతిదాటుటకు అవకాశం కలదు జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది.

 



మిథున రాశి :ఈవారం మొత్తంమీద ఆరంభంలో అధికమైన ఆలోచనలు  అవకాశం కలదు వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. తలపెట్టిన పనులను మిత్రులను కలుపుకొని వెళ్ళుట వలన విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది.మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన వారి నుండి లబ్దిని పొందుటకు అవకాశం కలదు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.మనసులో ఏదైనా పనిని ఆరంభించేటప్పుడు పూర్తిస్థాయి సంసిద్దత ఉంటే మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన లాభం పొందుటకు అవకాశం ఉంది.

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభం బాగుంటుంది సంతోషాన్ని పొందుతారు బంధుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. అతివిశ్వాసం మంచిది కాదు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దానిపర్యవసానం చివరలో పొందవలసి రావోచ్చును జాగ్రత్త. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి సమయపాలన పాటించుట వలన ఇబ్బందులు తగ్గుటకు అవకాశం ఉంది. ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. ప్రయాణాలు చేయునపుడు జాగ్రత్తగా లేకపోతే విలువైన వస్తువులు పోయే ఆస్కారం కలదు జాగ్రత్త. వ్యాపారపరమైన విషయల్లో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. పెద్దలతో చేయు చర్చలు పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చును.

 

 

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభం కొంత ఇబ్బందులు కలిగినను తర్వాత మీరు చేపట్టిన పనులలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. అధికారులతో గల మంచి అనుభంధం మీకు ఉపయోగపడుతుంది. నూతన నిర్ణయాలు కొంత ఆలోచించి తీసుకోవడం వలన మరింత లాభంను పొందుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరప్రదేశం నుండి నచ్చిన వార్తలు వినే అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం వేచిచూసే దోరణి మంచిది. పెట్టుబడ్లు బాగా ఆలోచించి పెట్టుట సూచన. పనిఒత్తిడి ఉండుటకు ఆస్కారం ఉంది సమయానికి భోజనం చేయకపోతే అనారోగ్యసమస్యలు తప్పక పోవచును. కుటుంభసభ్యులతో కలిసి సమయాన్ని గడుపుటకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటారు.

 

 

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో ఆలోచనలు చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది కాకపోతే ఆస్థాయి ప్రయత్నం అవసరం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నలుగురిలో గుర్తింపు కోసం చేయుప్రయత్నాలు ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్త. వారం చివరలో పని ఒత్తిడి మూలాన కొంత అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగంలో మాములుగా ఉంటుంది ప్రణాళిక అవసరం,అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం వలన మేలుజరుగుతుంది.

 

 

తులా రాశి : ఈవారం మొత్తంమీద కుటుంభంలో శుభకార్యములకు ఆస్కారం ఉంది. వారం ఆరంభంలో కుటుంభంలో ఎటువంటి చర్చలు చేపట్టకపోవడం సూచన పెద్దల అబిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. వారంలో దాదాపు చేపట్టిన అన్ని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు పరిశీలన చేస్తారు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. అధికారులతో చక్కటి సంభందాలు ఏర్పడుటకు అవకాశం కలదు వారికి అనుగుణంగా నడుచుకొనుట చేయండి మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అనారోగ్యం సూచితం. ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టునపుడు అనుభవజ్ఞుల సూచనలు పాటించుట వలన మేలుజరుగుతుంది.

 

 

 

వృశ్చిక రాశి :ఈవారం మొత్తంమీద ఆలోచనలలో మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది అవి మిమ్మల్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు పొందుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులలో ఇబ్బందులు కలిగినను మనోదైర్యంతో ముందుకు వెళ్తారు. ఆరంభంలో నలుగురిలో చేసిన ఆలోచనల మూలాన గుర్తింపును పొందుతారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. చాలావిషయాల్లో కుటుంభసభ్యుల సహాకారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్యున్ని సంప్రదించుట మంచిది. ఉద్యోగంలో కొంత అనుకూలత ఉంటుంది నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. వ్యతిరేకవర్గం ద్వారా ఇబ్బందులు కలుగుతాయి. కుటుంభంలో చిన్న చిన్న మార్పులకు అవకాశం ఉంది వాటిని స్వాగతించుట మంచిది. ఉద్యోగంలో అధికారుల వలన శ్రమను పొందుతారు. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు చేపట్టుట వలన మేలుజరుగుతుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకపోవడం సూచన వివాదములకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండుట సూచన. వ్యాపరవిషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. చేపట్టే పనుల విషయంలో పూర్తిస్థాయి అవగాహన పెంచుకొనే ప్రయత్నం చేయండి

 

 

మకర రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం కలదు. పనులలో మాత్రం కొంత నిదానం అవసరం లేకపోతే అనవసరమైన ఆలోచనలు పొందుటకు అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో కలిసి తీసుకొనే నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు బాగాఆలోచించి ముందుకు వెళ్ళుట మంచిది. ఉద్యోగంలో అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకున్న వ్యతిరేకతలు పెద్దగా ఉండకపోవచ్చును కావున నలుగురితో కలిసి పనిచేసినచో మేలుజరుగుతుంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు వారితో సమయాన్ని గడుపాలనే తలంపు ఉంటుంది. వ్యాపారంలో పనిఒత్తిడి తప్పక పోవచ్చును.

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో చాలావరకు సర్దుబాటు అవసరం మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్థాయి. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాలు కొత్త మార్పులు చోటుచేసేకొనే విధంగా ఉంటవి. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టుబడులు పెట్టుటకు అవకాశం ఉంది కాకపోతే ఈ విషయంలో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చుటకు అవకాశం ఉంది ఓర్పు అవసరం. పెద్దలతో చేసిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి వాటికి ఒక రూపం ఇచ్చుటకు ప్రయత్నం చేస్తారు. ఊహించని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది కాకపోతే సమయానికి ధనం చేతికి అందుతుంది.
 

మీన రాశి : ఈవారం మొత్తంమీద వారం చివరలో తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మీ అనుకున్న వారితో విబేదాలు కలుగుటకు అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ప్రయాణాల విషయంలో మార్పులు అవసరం సాధ్యమైనత వరకు దూరప్రదేశ ప్రయాణాలు చేయకండి. పనులలో శ్రమతప్పక పోవచ్చ్చును ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట ఉత్తమం. మిత్రులతో,బంధువులతో కలిసి నూతన నిర్ణయాలు చేయకపోవడం సూచన. వ్యాపారపరమైన విషయల్లో మిశ్రమఫలితాలు పొందుటకు అవకాశం ఉంది అనుభవజ్ఞుల సూచనలు అవసరం. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి కొంత గోప్యత అవసరం. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలు తెల్సుకొనే అవకాశం ఉంది

మరిన్ని శీర్షికలు