Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rangasthalam equations change

ఈ సంచికలో >> సినిమా >>

మిల్కీ బ్యూటీతో కళ్యాణ్‌రామ్‌ కొత్త కొత్తగా..

milky beauty with kalyan ram

నందమూరి నటసింహం కళ్యాణ్‌రామ్‌ - మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'నా నువ్వే'. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. జయేంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. కళ్యాణ్‌రామ్‌, తమన్నా చాలా చాలా కొత్తగా కనిపిస్తున్నారు సినిమాలో. ట్రైలర్‌ చాలా బాగుంది. కూల్‌ అండ్‌ రొమాంటిక్‌ మూడ్‌లో ఉంది. సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉండనుంది. ఓ అందమైన రేడియో జాకీ, ఓ కుర్రాడి ప్రేమలో పడుతుంది. అనుకోని కారణాలతో వారు తమ ప్రేమని కొంత కాలం త్యాగం చేయాల్సి వస్తుంది. కొంత కాలం తర్వాత తప్పకుండా లుసుకుందాం అని విడిపోయిన ఆ జంట మళ్లీ ఎలా కలిసింది? వారి మధ్య ప్రేమ ఎలా నిలిచింది? అనేదే ఈ సినిమా కథ. రేడియో జాకీ పాత్రలో తమన్నా చాలా బాగా నటించినట్లు కనిపిస్తోంది ట్రైలర్‌ చూస్తుంటే.

టోటల్‌గా ఈ సినిమాలో తమన్నా చాలా కొత్తగా కనిపిస్తోంది. తమన్నా స్క్రీన్‌పై కనిపించి చాలా కాలమే అయ్యింది. దాంతో ఈ సినిమాలో ఫ్రెష్‌లుక్‌లో కనిపించడంతో పాటు, ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. తమన్నా యాక్టింగ్‌ స్కిల్స్‌ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం తన నటనలోని న్యూ యాంగిల్‌ని బయటికి తీసినట్లుగా కనిపిస్తోంది తమన్నా. కమర్షియల్‌గా ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో తెలీదు కానీ, ట్రైలర్‌ని మాత్రం చాలా హృద్యంగా కట్‌ చేశారు. తమన్నా - కళ్యాణ్‌రామ్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ నిజంగా సూపర్బ్‌గా ఉంది. ఎక్కడా వల్గారిటీ లేదు కానీ, మనసుకు హత్తుకునేలా ఉంది. ట్రైలర్‌ కోసమే ఇంతగా చర్చించుకుంటున్నామంటే సినిమా ఇంకెంతలా ఉండబోతోందో చూడాలిక. అతి త్వరలోనే 'నా నువ్వే' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని సినిమా కబుర్లు
hello akhil won