Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
milky beauty with kalyan ram

ఈ సంచికలో >> సినిమా >>

'హలో' అఖిల్‌ ఇలా గెలిచాడు

hello akhil won

నెలల వయసులోనే బిగ్‌ స్క్రీన్‌పై 'సిసింద్రీ'గా సూపర్‌ హిట్‌ కొట్టేశాడు అఖిల్‌. ఆ రోజుల్లో చిన్నారి అఖిల్‌ నటించిన 'సిసింద్రీ' సినిమా అప్పట్లో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అయితే హీరోగా తొలి సినిమా 'అఖిల్‌'తో మాత్రం భారీగా నిరాశ పరిచాడు. తొలి అటెంప్ట్‌లోనే భారీ డిజాస్టర్‌ చవిచూశాడు అఖిల్‌. రీ లాంఛింగ్‌ మూవీగా తెరకెక్కిన రెండో సినిమా 'హలో'తో ఫర్వాలేదనిపించినా, కమర్షియల్‌గా ఆశించిన హిట్‌ అందుకోలేకపోయింది

'హలో'. అయితే అఖిల్‌ అండ్‌ టీమ్‌కి అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. వరల్ట్‌ స్టంట్‌ అవార్ట్స్‌కి అఖిల్‌ 'హలో' సినిమా నామినేట్‌ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా డైరెక్టర్‌ అయిన విక్రమ్‌ కుమార్‌ తమ సినిమాకి ఇంతటి అరుదైన గౌరవం దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. వరల్ట్‌ బెస్ట్‌ యాక్షన్‌ మూవీస్‌లో 'హలో' సినిమా నామినేట్‌ కావడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం అఖిల్‌ చాలా కష్టపడ్డాడు. అఖిల్‌ని హీరోగా నిలబెట్టేందుకు నాగార్జున ఎంతగానో తపన పడ్డారు. మొత్తానికి వారి కష్టం ఈ రకంగా ఫలించినందుకు చిత్ర యూనిట్‌ అంతా సంతోషం వ్యక్తం చేసింది. 2017లో అఖిల్‌ 'హలో' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో కళ్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం అఖిల్‌ 'తొలిప్రేమ' డైరెక్టర్‌ వెంకీ అట్లూరి సినిమాలో నటిస్తున్నాడు. 

మరిన్ని సినిమా కబుర్లు
me, mahanati