టాలీవుడ్ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఇండస్ట్రీ పరువును బజారుకీడ్చిన నటి శ్రీరెడ్డి, తాజాగా కోలీవుడ్‌పై తన ఆరోపణల పర్వం మొదలెట్టింది. మొన్న ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ తనను మోసం చేశాడనీ, అవకాశాలిస్తానని చెప్పి తనపై అసభ్యంగా ప్రవర్తించాడనీ ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. నిన్న తమిళ హీరో శ్రీరామ్ తనను ఓ హోటల్ రూంకి రమ్మన్నాడంటూ ఆయనపై ఆరోపణలు చేసింది. తమిళ అగ్ర హీరో, తెలుగోడు అయిన విశాల్‌పైనా ఆరోపణలు చేసింది. విశాల్ తనను బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది. అయితే విశాల్ మామూలోడు కాదు. విశాల్‌ని కెలికితే మరోలా ఉంటుంది.
ఏమైందో ఏమో కానీ, తప్పు తెలుసుకున్నట్లుంది శ్రీరెడ్డి. తర్వాత విశాల్‌కి సారీ చెప్పి తప్పుకుంది. ఇలా కోలీవుడ్ ప్రముఖులపై పడిందిప్పుడు శ్రీరెడ్డి కన్ను, నోరు. ఇదంతా చూస్తుంటే, శ్రీరెడ్డి సినీ పరిశ్రమ మొత్తాన్ని వదిలిపెట్టేలా లేదంటూ సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్లు గుమ్మెత్తుతున్నాయి. టాలీవుడ్ అయిపోయింది. ఇప్పుడు కోలీవుడ్‌ని చుట్టుముట్టింది. నెక్స్ట్ బాలీవుడ్‌నీ తగులుకుంటుందేమో అంటున్నారు. ఏమో కాదేదీ శ్రీరెడ్డి కనర్హం అన్నట్లుగా ఓ సిస్టమేటిగ్గా నడిపిస్తోంది తన ఆరోపణల పర్వం. ఏం చేసినా అవకాశాల కోసమే. కానీ ఇలా చేస్తే అవకాశాలు వస్తాయా? ఇంత రచ్చ చేసి వచ్చిన ఒకటి రెండు అవకాశాలనూ వదులుకుంది శ్రీరెడ్డి. అసలింత చేసి, శ్రీరెడ్డి సాధించిందేంటి. చీప్ పబ్లిసిటీ తప్ప. మరి కొత్తగా శ్రీరెడ్డి ఇంకేం ప్లాన్ చేసిందో చూడాలిక.
|