బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ సో హాట్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ హాట్ ఆ హాట్ కాదు. ఇది రెమ్యునరేషన్ హాట్ అన్నమాట. విద్యాబాలన్ ఇప్పుడు తెలుగులో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్‌లో విద్యాబాలన్ 'బసవతారకం' పాత్ర పోషిస్తోంది. ఈ పాత్ర కోసం విద్యాబాలన్ భారీ రెమ్యునరేషన్ అందుకుంటోందని తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమాలో నటించేందుకు విద్యాబాలన్ ఒప్పుకోలేదట. తర్వాత ఆ పాత్రలోని భావోద్వేగాల గురించి పూర్తిగా తెలుసుకున్న విద్యాబాలన్, ఇలాంటి ఓ అరుదైన పాత్రతో తన టాలీవుడ్ ఎంట్రీ ఉంటే బావుంటుందని ఆలోచించి ఈ సినిమాకి సైన్ చేసిందట. ఎలాగైనా చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది విద్యాబాలన్.
ఆమె ఓ పాత్రను ఎంచుకుందీ అంటే ఆ పాత్రను అంత ఆషామాషీగా అంచనా వేయలేం. అందుకే సిల్క్ బయోపిక్ 'డర్టీ పిక్చర్' వంటి సినిమా ఆమె నుండి వచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా బయోపిక్స్‌లో విద్యాబాలన్‌కి అవకాశాలు వచ్చాయి. కానీ అవేమీ విద్యాను ఇంప్రెస్ చేయలేదు. ఎట్టకేలకు మళ్లీ 'ఎన్టీఆర్' బయోపిక్‌లో నటిస్తోంది. తాజాగా షూటింగ్‌లో పాల్గొన్న విద్యాబాలన్, బాలయ్య ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటో ఒకటి బయటికి వచ్చింది. ఆ ఫోటోలో బాలయ్యతో పాటు విద్యాబాలన్, బాలయ్య భార్య, కుమారుడు, కుమార్తై, ఆయన సోదరి లోకేశ్వరీ ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం బాలయ్య స్వీయ నిర్మాణంలో రూపొందుతోంది.
|