బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్‌కి తెలుగులో సినిమా చేయాలని ఉందని అప్పుడెప్పుడో చెప్పింది. అయితే తాను తెలుగులో సినిమా అంటూ చేస్తే అది ఎన్టీఆర్ సినిమానే అని చెప్పింది. తనకి టాలీవుడ్ హీరోల్లో ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమనీ, ఎన్టీఆర్‌తోనే తెలుగులో తన ఫస్ట్ మూవీ ఉంటుందనీ అలియాభట్ చెప్పింది. అయితే అది నెరవేరడం లేదిప్పుడు. అలియాభట్ ఏకంగా టాలీవుడ్‌లో అగ్రహీరో అయిన నాగార్జున సినిమాలో నటిస్తోంది. ఆగండాగండి అది డైరెక్ట్ సినిమా కాదులెండి. అలాగనీ, నాగార్జునకు జోడీగా కూడా అలియాభట్ నటించడం లేదులెండి.
బాలీవుడ్‌లో 'బ్రహ్మాస్త్ర' టైటిల్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్‌వీర్ కపూర్, అలియాభట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదే సినిమాలో మన టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాని హిందీతో పాటు, తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. అలా ఈ సినిమా తెలుగులోకి వస్తుందన్న మాట. అంటే అలియాభట్ తెలుగు ఎంట్రీ ఈ సినిమాతోనే అని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పొచ్చు. తెలుగు ఆడియన్స్‌కి కనిపించాలన్న అలియాభట్ కోరిక ఈ విధంగా తీరింది కానీ, అది ఎన్టీఆర్ సినిమాతో మాత్రం కాదు. ఏదేమైనతేనేమి మొత్తానికి అలియాభట్ కోరిక ఏదో ఒక రకంగా తీరుతోంది. ఏమో ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ కోరుకున్నట్లుగానే డైరెక్ట్ తెలుగు సినిమాలో అదీ ఎన్టీఆర్ సినిమాలో కూడా నటిస్తుందేమో చూడాలిక.
|