Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

27-7-2018 నుండి 2-8-2018 వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి : ఈవారం  ఆరంభంలో ఉన్న ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపార పరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. దూరప్రదేశం ప్రయాణం చేయుటకు అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే టప్పుడు తొందరపాటు ఆలోచనలు చేయకండి. వాహనాల వలన అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఊహించని విధంగా మంచి గుర్తింపును పొందుతారు.

 

 

 వృషభ రాశి : ఈవారం దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. చిన్న చిన్న పనుల వలన పెద్దల నుండి ప్రశంశలు పొందుతారు. వ్యాపార పరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. రుణపరమైన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. తండ్రితరుపు బంధువులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. అనుకోకుండా ప్రయాణాలు చేస్తరు.

 

 


మిథున రాశి :ఈవారం మీ మాటతీరు విషయంలో అలాగే ఇతరుల విషయంలో ఏవిధంగా ప్రవర్తిస్తున్నామో ఆలోచన చేయుట వలన మేలుజరుగుతుంది. సోదరులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను కాస్త ఇబ్బందులతో పూర్తిచేసే అవకాశం ఉంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొనడం వలన మేలుజరుగుతుంది. సంతానపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో మీ నిర్ణయాలు తెలియజేసే ప్రయత్నం మంచిది. సముద్రతీర ప్రాంతాలు ప్రయాణాలు చేయుటకు లేదా వాతై విషయంలో స్పష్టమైన ఆలోచనలకు ఆస్కారం ఉంది.

 

 

 

 

 

కర్కాటక రాశి :  ఈవారం పెద్దలను కలుస్తారు వారితో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. గతంలో తీసుకున్న రుణాలకు సమాధానం చెప్పవల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. సోదరులతో చేపట్టిన చర్చలు వాయిదా పడే ఆస్కారం కలదు. మీ కొన్ని నిర్ణయాలు కొంత మందిని ఇబ్బందికి గురిచేసే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

 

 సింహ రాశి : ఈవారం సమయాన్నిసరాదాగా గడుపుటకు ఇష్టపడుతారు. మిత్రులను కలుసుకొని అవకాశం ఉంది. పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొనేటప్పుడు వారై అభిప్రాయాలను ముందుగానే తెలుసుకొని , వాటికి అనుగుణంగా ముందుకు వెళ్ళుట సూచన. వ్యాపారపరమైన విషయాల్లో బాగాఉంటుంది, పెద్దల నుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే విషయాల్లో తొందరపాటు వద్దు. సమాజిక పరమైన విషయాలలో బాధ్యతలు పెరుగుటకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి.

 

 

కన్యా రాశి : ఈవారం పెద్దలను కలుస్తారు, వారితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీఉస్కోనే అవకాశం ఉంది. సంతానం విషయంలో గాత్మలో ఉన్న ఆందోళన ఇప్పుడు ఉండక పోవచ్చును. చిన్న చిన్న విషయాలకే ఆనందం పొందుతారు. ప్రయాణాలు చేయునపుడు నూతన పరిచయాలుఅయ్యే అవకాశం కలదు. సోదరులతో చేపట్టిన చర్చలు ఒక కొలిక్కిబ్ వస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో భాగసామ్యం విషయంలో నూతన ఒప్పందాలకు ఆస్కారం కలదు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చూపకండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యే ఆస్కారం ఉంది.

 

 

 

 

 

తులా రాశి : ఈవారం ఉద్యోగంలో బాగానే ఉంటుంది, నూతన ఆఆలోచనలను కలిగి ఉంటారు. ముఖ్యంగా వివాదాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది, ప్రయత్నం ముందుకుసాగుతుంది. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. జీవితభాగస్వామితో మీకున్న విభేదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది. సంతానం విషయంలో కాస్త ఆందోళలన కలిగి ఉంటారు.

 

 

వృశ్చిక రాశి :  ఈవారం నూతన పనులకు ప్రాధాన్యం ఇస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. సంతానం వలన నలుగురిలో మంచి పేరును పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం కలదు. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి.

 

 

 

ధనస్సు రాశి : ఈవారం పెద్దలను కలుస్తారు, వారితో కలిసి ముఖ్యమైన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందే ఆస్కారం ఉంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సహకారం అందుతుంది. మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన వాటికోసం చర్చ జరిగే ఆస్కారం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం మంచిది. 

మకర రాశి : ఈవారం మిత్రులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో పనిఒత్తిడికి ఆస్కారం ఉంది. అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. స్త్రీ లేదా పురుష సంభందమైన విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్దగా ఉన్న నూతన సమస్యలకు ఆస్కారం ఉంది. సంతానం విషయంలో పెద్దల సూచనలను పాటించుట ఉత్తమం. తండ్రితరుపు బంధువుల ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధకు గురిచేస్తాయి. అనుకోకుండా దూరప్రదేశ ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

కుంభ రాశి : ఈవారం జీవితభాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయుటకు లేదా సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. వాహనాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. కుటుంబంలో మీ ఆలోచనలు పెద్దలకు నచ్చక పోవచ్చును. వృత్తిలో చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకపోవడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుటకు ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి , పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు.

 

మీన రాశి :  ఈవారం సంతాన పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. బంధువులను కలుస్తారు, వారితో కలిసి ముఖ్యమైన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలను కలుస్తారు. కుటుంబంలో కొంత ఇబ్బందులు కలిగే ఆస్కారం ఉంది. పట్టుదలకు వెళ్ళకపోవడం సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో లేక వృత్తిలో బాగుంటుంది , నూతన అవకాశాలు పొందుతారు.

మరిన్ని శీర్షికలు
Kanyasulkam stopped