కావలసిన పదార్థాలు:
బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు.
తయారు చేయు విధానం:
ముందుగా బాణీలో నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరప కాయ ముక్కలు, ఒక ఎండు మిరపకాయ, ఒక వెల్లుల్లి రేఖ వేసుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా వేగాక అందులో బెండకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. బెండకాయలు ఉడికాక అందులో మసాల పొడి, కొత్తిమీర వేసుకొని, ఒక పదినిమిషాలు ఉడకనిస్తే, రుచికరమైన బెండకాయ మసాలా కూర రెడీ!!
|