చక్కనమ్మ(య్య) చిక్కినా అందమే అంటారు....కానీ చిక్కడం అనేది అంత తేలికేం కాదు....దానికెంతో ఓపిక కావాలి, కొన్ని పద్ధతులవలంబించాలి...ఒక క్రమశిక్షణగా వెళ్ళాలి...అన్నీ పాటిస్తూ ఫలితం కోసం వేచి చూడాలి...ఇది కూడా ఒక తపస్సు లాంటిదే....పరీక్షల కోసం శ్రద్ధగా ప్రిపేరవడం లాంటిదే....ఏమాత్రం తొందరపడి మధ్యలో వదిలేసినా మళ్ళీ కథ మొదటికి రావడమేకాదు, ప్రాణాలకే ఎసరు రావొచ్చు....
అందాల ముద్దుగుమ్మ ఆర్తీ అగర్వాల్ ఉదంతమే ఇందుకు చక్కని ఉదాహరణ..ముఖ్యంగా సినిమా తారలైతే తమ ఫిట్ నెస్ కోసం తీసుకునే శ్రద్ధా, పెట్టే ఖర్చూ తక్కువేం కాదు....అంతకుముందు వాళ్ళు బాలేరని కాదు, బాగుండరనీ కాదు కానీ, "ఇప్పటిదాకా ఒక లెక్కా ఇప్పట్నుంచీ ఒక లెక్క....ఎందుకంటే ఇప్పుడు మేము తగ్గామూ....." అంటూ వాళ్ళిచ్చే పోజు చూస్తే ఔరా అనిపించక మానదు....స్థూలకాయంతో తమమీద తమకే నిరసనగా ఉన్నవాళ్ళకు అసూయ కలిగించక మానదు....ఒక్కసారి లావెక్కామంటే తగ్గడం కష్టం అని అనేవాళ్ళకు స్ఫూర్తిగా నిలిచిన ఈ తారలను ఓ లుక్కేద్దామా....!
|