Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
satya sai told as

ఈ సంచికలో >> శీర్షికలు >>

భారతదేశ అభివృద్ధి - విద్యార్ధుల, తల్లిదండ్రుల ఆలోచనా శైలి - హనుమాన్ ప్రసాద్

Development of India - Student and Parents' Thinking Style

ప్రపంచం లో వున్న అన్ని దేశాల కంటే మన భారతదేశం  కళలకు, వివిధ సంస్కృతులకు, విజ్ఞాన వేత్తలకు పుట్టినిల్లు. మనం ఈ మధ్యనే, 71 వ స్వాతంత్ర్య సంబరాలను అత్యంత సంబరాలతో నిర్వహించుకున్నాం. మరి ఇంత అపారమైన మేధా సంతస్సు గల మన భారత దేశం, 71 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశం ఈ రోజుకు " అభివృద్ధి "  " చెందుతున్న" దేశం గా పరిగణించ బడడం అత్యంత శోచనీయం.

దీనికి ప్రధాన కారణంగా, మనం దేశం లోని తల్లి దండ్రులు వారి పిల్లల పట్ల వారికి వున్న వారి భవిష్యత్ కలల వల్ల సరైన మార్గదర్శనము లేక.. "నేటి విద్యార్ధులే రేపటి పౌరులు" అనే నినాదానికి సరైన ఆచరణ లేక పోవటం వలన భారత దేశం అభివృద్ధి కుంటుపడుతున్నది. నేటి విద్యా వ్యవస్థలో "THEORY" కి ఇస్తున్న ప్రాముఖ్యత PRACTICALITY కి ఇవ్వక పోవడం వలన, ఈ తరం విద్యార్ధులు, తమ అమూల్యమైన బాల్యాన్ని, K.G నుండి P.G దాకా, దాదాపు 17 సంవత్సరాల విలువైన సమయాన్ని తరగతి గదులలో అభ్యసిస్తున్న చదువులకు, వాళ్ళు ఆ చదువుల తరువాత చేస్తున్న ఉద్యోగాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా జీవితాలు వెళ్ళదీస్తున్నారు.

చదువుకున్న ప్రతి విద్యార్ధి, తమ మేధస్సును ఇంకొకరికి "తాకట్టు" పెట్టి వెట్టి చాకిరి చేస్తూ 'బానిస ' బ్రతుకులు బ్రతుకుతూ స్వాతంత్ర్యం వచ్చినా "బానిసత్వం" మాత్రం పోలేదు. ఉదాహరణకు, నేడు విద్యా "నిలయాలు" కాస్తా విద్యా " FACTORY" లుగా మారి పోయినాయి. వాళ్ళకు సహజంగా వుండాల్సిన అబ్బిన నైపుణ్యాలను కాలరాసుకుని ఉద్యోగ అర్ధులు గా మిగిలి పోతున్నారు. చదువుతున్న విద్యార్థి కావచ్చు, చదివిస్తున్న తల్లిదండ్రులు కావచ్చు. ఏదో ఒక ఉద్యోగం వొస్తే జీవన సాఫల్యం పొందినట్లు భావిస్తున్నారు.
ప్రతి ఒక విద్యార్థి ఒక ఆణిముత్యం. వాళ్ళలో సహజంగా వున్న నైపుణ్యాలకు మెరుగులు దిద్ది, వారిని, వారికనుకూలమైన రంగాలలో రాణించేటట్లు చూడ వలసిన భాద్యత తల్లిదండ్రులదే.. అలా జరిగిన నాడు మన భారత దేశంలో ఒక సచిన్ టెండుల్కర్, ఒక కోనేరు హంపి, ఒక కర్సెన్ భాయి పటేల్ లాంటి వారిని సగర్వంగా మన భారత దేశపు ప్రతిబింబాలుగా తీర్చి దిద్దవచ్చును.
 

మరిన్ని శీర్షికలు
Veg Pulao in Rice Cooker!