Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ది యాక్టర్ లఘు చిత్ర సమీక్ష - పి.వి.సాయిసోమయాజులు

హైదరాబాద్ లో కృష్ణానగర్ వాసులు సినిమా ఇండస్టీలోకి వెళ్ళడానికి పడే కష్టాలు మనందరికీ తెలిసింdE. పూరి జగన్నాద్ గారు తీసిన ‘నేనింతే’ చిత్రంలో చూపించిన పరిస్థితులే ఇప్పుడు, ఎప్పుడూనూ! దీని మీద ఇటీవల వచ్చిన లఘుచిత్రం- ‘ది యాక్టర్’. ఈ చిత్ర సమీక్ష, మీ కోసం-

కథ

సూపర్ స్టార్ ఆవుదామని కలలుగని, ఒక్క ఛాన్స్ కోసం వెతుకుతూ కృష్ణానగర్ లో ఎంతో మందిలో శీను కూడా ఒకడు. యాక్టర్ అవ్వాలన్న తపనతో ఉన్న శీనుకి ఒక అవకాశం labhistundi కాని, మొదలవ్వక ముందే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి పోతుంది. ఆ తర్వాత ఏమైందన్నదే ఈ కథ!

ప్లస్ పాయింట్స్-
బడ్జెట్ తగ్గించడానికై వాడిన కొన్ని టెక్నిక్స్ అభినందించాలి. ఈ చిత్రం ఎలా తీశారన్నది ఒక వైపున ఉంచితే, ఇది చాలా నిజాయితీతో తీసిన చిత్రం అని అనిపిస్తుంది. హీరో చెప్పే ఓ పెద్ద మోనోలాగ్ ఆకట్టుకుంటుంది. చివరి రెండు నిమిషాలలో ఇచ్చిన సందేశం అభినందనీయం.

మైనస్ పాయింట్స్-
యాక్టర్ అvvaaలన్న తపన సరిగ్గా చిత్రంచ లేక పోయారు. ఇరవై నిమిషాల నిడివిలో కృష్ణా నగర్ వాసులు పడే తిప్పలు ఎన్నో చూపించ గలిగే అవకాశం ఉన్నా, ఒక్క చిన్న పాయింట్ నే  సాగ దీశాడు డైరక్టర్. ‘ది యాక్టర్’ అని టైటిల్ పెట్టినా, ఒక యాక్టర్ కథ చెబుతున్నా, ఈ చిత్రం నటన పరంగా అనుకున్నంతగా ఆకట్టుకోదు. డైలాగ్స్ లో డెప్త్ కనపడక పోగా, ఒకటో రెండో డైలాగ్స్ ఆడియన్స్ ను మిస్ లీడ్ చేసే అవకాశం ఉంది. మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న కథ అయినప్పటికీ, మనం ఆ పాత్ర ఫీల్ అవుతున్నట్టు, అవ్వలేక పోతాం. క్లైమాక్స్ లో ఫ్రెండ్‍ని కాపాడక పోగా లెక్చర్ ఇయ్యడం సిల్లీగా, ఇల్లాజికల్ గా అనిపిస్తుంది.

సాంకేతికంగా-
ఓపెనింగ్ టైటిల్స్ అప్పుడు లైటింగ్, ఫిల్టర్ మంచి ష్టార్ట్ ని ఇస్తుంది. కెమెరా మూమెంట్స్ చాలా యాప్ట్ గా ఉంటుంది. మ్యూజిక్ ప్లస్ అయ్యింది. డబ్బింగ్ చాలా పూర్ గా అనిపిస్తుంది, ముఖ్యంగా క్లైమాక్స్ లో! ఎడిటింగ్ బాగున్నప్పటికీ ఈ సినిమాని నిలపలేక పోయింది. స్క్రీన్ ప్లే  లో కొత్తదనం లేదు, కథ ఎన్నో సార్లు విన్నదే!

మొత్తంగా-
అయిదు నిమిషాలలో చూపించాల్సింది చూపించుంటే పోయేది, ఇరవై నిమిషాలు తియ్యాలంటే ఎమోషనల్ డెప్త్ ఉండాలిగా మరి!

అంకెలలో-
2.75 / 5

మరిన్ని శీర్షికలు
sira chukkalu