ఒకటే పదిసార్లు-
తిండిపోతు;
అన్నీ ఒకసారి-
భోజనప్రియుడు.
.................................................................

కోరి తెచ్చుకునేది
ఏకాంతం;
కోరుకోకుండా మీదపడేది
ఒంటరితనం.
.................................................................

పొరుగూరెళ్లామంటూ
ఫోటోలు;
ఫేసుబుక్కులో లైకులు,
ఇంట్లో దొంగలు.
.................................................................

గంగలో ఎటు మునిగినా
పుణ్యమే;
స్త్రీని ఎటునుంచి చూసినా
అందమే.
|