Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
churaka

ఈ సంచికలో >> సినిమా >>

శర్వానంద్‌నీ డామినేట్‌ చేసేసిందబ్బా.!

Sharmanand has done the dominant.

'ఫిదా' సినిమాతో వీరూ వారూ అనే తేడా లేకుండా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌నీ, అటు యూత్‌నీ అందర్నీ ఫిదా చేసేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. మలయాళంలో 'మలర్‌' సినిమాతో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ తెలుగులో వరుసగా 'ఫిదా', 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' సినిమాలతో సూపర్‌ హిట్స్‌ కొట్టేసింది. దాంతో అమ్మడిని లక్కీ బ్యూటీ అంటూ పాపులర్‌ చేసేశారు. ఇకపోతే ఇప్పుడీ ముద్దుగుమ్మ శర్వానంద్‌ హీరోగా 'పడి పడి లేచె మనసు' మూవీలో నటిస్తోంది. డిసెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఆ టీజర్‌ ఎలా ఉందంటే, శర్వానంద్‌ యాక్టింగ్‌ టాలెంట్‌ అందరికీ తెలిసిందే. మరి మన మలర్‌ బ్యూటీ ఏం తక్కువా అందుకే తన నేచురల్‌ పర్‌ఫామెన్స్‌తో ఏకంగా మన శర్వానంద్‌నే డామినేట్‌ చేసేసింది. ఎంతైనా మనోడు మరి ఆ అమ్మాయి వెంట వెంట అలా పడుతుంటే అంతే మరి.

ఆ అమ్మాయి ఎక్కడికెళ్తే అక్కడికి శర్వానంద్‌ కూడా ఫాలో చేస్తుంటాడు. చివరికి ఎందుకు నా వెంట పడుతున్నావని అమ్మాయి అడిగితే, మన హీరోగారు కిలోమీటరు దూరం నుండి అరెరె నా దారిన నేను లవ్‌ చేసుకుంటుంటే, కనిపెట్టేశావా? అన్నట్లు మీనింగ్‌ వచ్చేలా చెప్పే డైలాగ్‌ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్‌ని బట్టి చూస్తే క్యూట్‌ అండ్‌ క్లీన్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ అని తెలుస్తోంది. శర్వానంద్‌, సాయి పల్లవి జంట నేచురల్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
Samantha support for your too!