మోడలింగ్ రంగం నుండి వచ్చి సినిమాలపై ఆశక్తితో చిన్నతనం నుండే వివిధ రకాల డాన్సుల్లో శిక్షణ పొందిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఆల్రెడీ బాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించిన ఈ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారికి సుపరిచితురాలే. అయితే అక్కినేని హీరో నాగచైతన్యతో 'సవ్యసాచి' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదే ఈ బ్యూటీకి తెలుగులో తొలి సినిమా. బ్యాక్ టు బ్యాక్ అక్కినేని ఫ్యామిలీ హీరోస్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అరుదైన అదృష్టం దక్కించుకుంది అందాల నిధి అగర్వాల్. ఓ పక్క చైతూతో 'సవ్యసాచి' సినిమా సెట్స్‌పై ఉండగానే, అక్కినేని రాకుమారుడు అఖిల్ సినిమా 'మిస్టర్ మజ్ను'లోనూ నటించేస్తోంది. 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు. కాగా రీసెంట్‌గా చైతూ - నిధి అగర్వాల్ నటిస్తోన్న 'సవ్యసాచి' మూవీ నుండి ఓ ఆడియో సింగిల్ రిలీజయ్యింది.
'వై నాట్..' అంటూ సాగే ఈ ఆడియో సింగిల్‌లో నిధి అగర్వాల్‌ని సూపర్ హాట్‌గా చూపించారు. హాట్ అండ్ స్టైలిష్ లుక్స్‌లో నిధి అగర్వాల్ అందచందాలు ఫస్ట్‌లుక్‌లోనే ఇంప్రెస్ చేసేశాయి. యూత్‌ని బాగా ఎట్రాక్ట్ చేసేసింది ఈ హాట్ స్టిల్స్‌లో నిధి అగర్వాల్. దాంతో అమ్మడికి స్టార్ హీరోయిన్ అయిపోయే సినిమా ఉందంటూ అప్పుడే పోజిటివ్ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. ఒకవేళ సినిమా హిట్ అయ్యిందా? అమ్మడు ప్రజెంట్ పాపులర్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి సినిమాలో అమ్మడి హాట్ నిధుల ధమాకా ఎలా ఉండబోతోందో.!
|