Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
tamilnadu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రతాప భావాలు - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

prataapabhavalu

క్రెడిట్ కార్డ్

వ్యాపార ధృక్పథంతోనే పరిచయం చేసినప్పటికీ క్రెడిట్ కార్డ్ ను మనిషికి నిత్యజీవితంలో ఒక కామధేనువు, కల్పవృక్షంలతో పోల్చవచ్చు. ప్రతివిషయంలోను కష్ట నష్టాలు, సాధకబాధకాలూ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉపయోగించుకోడంలోనే ఉంటుంది మన విజ్ఞత, విచక్షణత.

మనం రోడ్డుమీదకి అడుగుపెడితే మన జేబులోని డబ్బును పొంద(గుంజ)డానికి అనేక షాపులు మనకు గాలం వేస్తుంటాయి. డబ్బుల్లేకపోతే మనం లొంగం. కాని కార్డ్ ఉంటే దర్జాగా లోపలికి వెళ్లి అవసరమైనవి, అనవసరమైనవి కొని బర్రుమని గీకిస్తాం. ఆ తర్వాత వచ్చే స్టేట్ మెంట్ ను చూసి గుండేలు బాదుకుంటాం. కార్డ్ ను తిట్టుకుంటాం.
ఇంతకుముందంటే కార్డ్ లకు యాన్యువల్ ఫీజులుండేవి. రూపాయి..రూపాయి బేరం చేసి తీసుకునే మనకు అది అనవసరమే. కాని ఇప్పుడు దాదాపు అన్ని సంస్థలూ క్రెడిట్ కార్డ్ లను ఫ్రీగానే ఆఫర్ చేస్తున్నాయి. అది మన జేబులో ఒద్దికగా ఉండే ఓ భరోసా. ఆపన్న హస్తం. దాన్నలాగే వాడుకోవాలి. మాల్స్, సూపర్ మార్కెట్లలోకి వెళ్లాక బాస్కెట్లు, ట్రాలీలు ఎడా పెడా నింపేసుకుంటుంటే చేతులు కాల్చుకుంటున్నట్టే!

మనం పెట్టగలిగిన డబ్బును మాత్రమే ఖర్చు చెయ్యాలి. అదే పొదుపంటే. కార్డున్నా అది అమలు చేయాల్సిందే. చేసి తీరాల్సిందే.

ఒక సంఘటన జస్ట్ ఊహించుకోండి.

అర్ధరాత్రి ఒక తీవ్ర ఆరోగ్య సమస్యతో హాస్పిటల్ కి వెళ్లాల్సొచ్చింది. చేతిలో అనుకున్నంత డబ్బులేదు. ఆ సమయంలో ఎవరికన్నా (డిస్ట్రబ్ చేసి)ఫోన్ చేసి డబ్బులడగలేం. కానీ మన చేతిలో కార్డ్ ఉంటే ఆనందంగా వెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. 

అలాగే ఒక అవసరమైన, ముఖ్యమైన వస్తువును మనం ఎప్పట్నుంచో కొనుక్కోవాలనుకుంటున్నాం. కార్డ్ ఉంటే మనం పే చేసి తీసుకోవచ్చు లేదా ఇ ఎమ్ ఐ ఫెసిలిటీతో (ఉంటే) తీసుకోవచ్చు. 

ముఖ్యంగా చిల్లరగా ఇవ్వాల్సిన డబ్బు కూడా కార్డ్ ద్వారా పైసా లాస్ కాకుండా పే చెయ్యోచ్చు,
మన ప్రతి ట్రాన్జాక్షన్ కీ పాయింట్లు కలుస్తాయి. ఆ పాయింట్లన్నీ రిడీమ్ చేసుకుని మనం కొన్ని వస్తువులు తీసుకోవచ్చు. కొన్ని షాపుల్లో కార్డ్ లతో పే చేస్తే మరిన్నీ బెనిఫిట్లూ ఉంటాయి.

కంపెనీలు మనం సమయానికి డబ్బు చెల్లించకుంటే బాగుణ్ననే చూస్తాయి. ఎందుకంటే అది వాళ్ల బిజినెస్. ఆ వచ్చే అత్యధిక ఇంట్రస్ట్ లతోటే వాళ్ల వ్యాపారం ఎన్నో పూలు, మరెన్నో కాయలుగా సాగుతుంది. మనం ఆ ట్రాప్ లోకి వెళ్లనంతవరకూ కార్డ్ అభయహస్తమే!

దేన్నైనా ఎలా వాడలన్నదానిమీదే ఆధారపడి ఉంటుంది. కరెంట్ బిల్ ఎక్కువస్తుందని మనం ఉండని రూం లోని లైట్లు, ఫ్యాన్లు ఆపేస్తాం. అలాగే కార్డ్ ను అవసరానికే వాడుకోవాలి తప్ప, అనవసరంగా బయటకు తీయకూడదు.
నా వరకూ నాకు బోలెడంత డబ్బు, ఓ బుజ్జి ప్లాస్టిక్ కార్డ్ రూపంలో నా పర్స్ లో ఉంటుంది. అదే నా బలం, ధైర్యం కూడా.

మరిన్ని శీర్షికలు
The difference looks like ...