తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ ప్రీత్‌సింగ్ బాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ని సొంతం చేసుకోలేకపోయింది. కానీ ఇప్పుడిప్పుడే అక్కడ పాగా వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. 'అయ్యారీ' సినిమా కోసం బాలీవుడ్‌కెళ్లిన రకుల్ ప్రీత్‌సింగ్ ఆ సినిమా రిజల్ట్ కాస్త అటూ ఇటూ కావడంతో ఏం చేయాలో తోచని స్థితిలో పడింది. అదే సమయానికి తెలుగులో అవకాశాలు దక్కకపోవడంతో రకుల్ కాస్త నిరాశపడిన విషయం వాస్తవమే. కానీ తమిళంలో మాత్రం రకుల్ ఫుల్ జోరు ప్రదర్శిస్తోంది. సూర్య, కార్తీ, శివకార్తికేయన్ వంటి హీరోల సరసన వరుస ఆఫర్స్‌తో అక్కడ బిజీగానే గడుపుతోంది.
ఇక తెలుగులో రకుల్ హవా ప్రస్తుతానికి చాలా తక్కువగానే ఉంది. ఎట్టకేలకు లాంగ్ గ్యాప్ తర్వాత ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్'లో ఇంపార్టెంట్ రోల్ శ్రీదేవి పాత్ర దక్కించుకుంది. ఇక అసలు విషయానికి వస్తే, బాలీవుడ్‌లో తాజాగా రకుల్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. మిలాప్ జవేరీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మర్‌జవాన్' అనే మూవీలో రకుల్ హీరోయిన్‌గా ఎంపికైంది. సిద్ధార్ద్ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 'అయ్యారీ' సినిమాలోనూ సిద్ధార్ధే హీరో. కాగా త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది. మరోవైపు అజయ్‌దేవగణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'దే దే ప్యార్ హై' మూవీలోనూ రకుల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టబు మరో హీరోయిన్‌గా నటిస్తోంది.
|