రాజు లేని రాజ్యం. ఒంటరిగా ఉన్న రాణినీ, రాజ్యాన్ని 'కవచం'లా కాపాడే ఓ కుర్రాడు. అలా అని ఇదేదో పీరియాడిక్ మూవీ అనుకునేరు. కానే కాదు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం కథే ఇది. ఈ సినిమా టైటిల్ 'కవచం'. శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. లేటెస్టుగా టైటిల్‌తో పాటు టీజర్‌నీ విడుదల చేశారు. 'భయపడేవాడికీ, భయపెట్టేవాడికీ మధ్యలో కవచంలా ఉండేవాడే పోలీస్..' అంటూ టీజర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్ టీజర్‌కి హైలైట్‌గా నిలిచింది. తొలిసారి పోలీస్ గెటప్‌లో బెల్లంకొండ నటిస్తున్న సినిమా ఇది. బెల్లంకొండ శ్రీనివాస్ అంటే మాస్ హీరో. యాక్షన్ ఇరగదీసేసే నిండైన కటౌట్ ఆయన సొంతం. ఆయన కటౌట్‌కి తగ్గట్లుగానే యాక్షన్ ప్యాకింగ్‌ని టీజర్‌లో చూపించారు. అలాగే పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన మూవీ ఇది.
అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుండడంతో రాణి ఎవరనే అంశంలో ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. ఏది ఏమైనా టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ బావుంది. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'జయ జానకి నాయకా' సినిమాతో మంచి హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్, 'సాక్ష్యం' సినిమాతో ఆశించిన రిజల్ట్ రాబట్టలేకపోయాడు. కానీ 'కవచం'తో ఆ స్థాయి హిట్‌ని మళ్లీ అందుకోవాలని ఆశిద్దాం.
|