అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న టాలీవుడ్ మెగా మల్టీ స్టారర్ 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం గ్రాండ్‌గా ఓపెన్ అయ్యింది. 11.11.11 అంటూ మూడు పదకొండుల ముహూర్తంతో నవంబర్ 11 ఉదయం 11 గంటలకు 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం స్టార్ట్ అయ్యింది. టాలీవుడ్ నుండి అతిరధ మహారధులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా, రాఘవేంద్రరావు తదితర సీనియర్ దర్శకులతో పాటు వెంకీ అట్లూరి వంటి యంగ్ దర్శకులు, అల్లు అరవింద్ తదితర నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యంగ్ హీరోలు రానా, కల్యాణ్‌రామ్ ఈవెంట్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి తొలి క్లాప్‌నివ్వగా రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.
'బాహుబలి' చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని దేశ దేశాల విస్తరించిన మహానుభావుడు రాజమౌళి. ఆ తర్వాత ఆయన నుండి వస్తున్న సినిమా కావడంతో, అదీ స్టార్ హీరోలతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల 19 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. బడ్జెట్ విషయంలో కనీ వినీ ఎరుగని రీతిలో హై టెక్నికల్ అండ్ రిచ్ వేల్యూస్‌తో సినిమాని రూపొందించేందుకు ప్రముఖ నిర్మాత డివివి దానయ్య సిద్ధంగా ఉన్నారు. కీరవాణి మ్యూజిక్‌లో సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీలో 'ఆర్‌ఆర్‌ఆర్' రూపొందుతోంది.
|