ఒకే హీరోయిన్‌తో అమర్ అక్బర్ ఆంటోనీ అని మూడు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించి అంతగా మెప్పించలేకపోయాడు మాస్ రాజా రవితేజ. అయితే ఇప్పుడు మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో మళ్లీ వస్తున్నాడు. ఈ సారి మాస్ రాజా ముగ్గురు భామలతోనూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనున్నాడు. ముగ్గురూ కొత్త భామలే. ఒకరు 'ఆర్‌ఎక్స్ 100'తో సంచలనం సృష్టించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ కాగా మరో భామ నభా నటేష్. 'నన్ను దోచకుందువటే' చిత్రంతో అందరి మనసుల్ని దోచేసి, 'అదుగో' సినిమాలో పంది పిల్ల బంటీతో కలిసి అల్లరల్లరి చేసింది కదా ఆ ముద్దుగుమ్మ. ఇక ముచ్చటగా మూడో భామ అచ్చమైన తెలుగు భామ ప్రియాంకా జవాల్కర్. 'టాక్సీవాలా' సినిమాతో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించింది కదా ఆ ముద్దుగుమ్మే ఈ ప్రియాంకా జవాల్కర్. రిలీజ్‌కి ముందే పైరసీ అయినా, రిలీజయ్యాక సెన్సేషన్ అయిన 'ట్యాక్సీవాలా' సినిమాలో క్యూట్‌గా అక్కడక్కడా సెక్సీగా కనిపించి ఆడియన్స్ మనసు కొల్లగొట్టేసింది.
అలాగే మన తెలుగు దర్శక, నిర్మాతల హృదయాల్నీ కొల్లగొట్టేసింది. అందుకే రెండో సినిమాకే ఇదిగో ఇలా మాస్ రాజాతో జోడీ కట్టే ఛాన్స్ దక్కించుకుంది. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మల నడుమ మాస్ రాజా చుక్కల్లో చంద్రుడిలా చిందేయనున్నాడన్న మాట. వి.ఐ.ఆనంద్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పక్కా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుంది.
|