రామ్‌గోపాల్ వర్మ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతోన్న రొమాంటిక్ ఫ్యాక్షన్ స్టోరీ 'భైరవగీత' ఈ నెల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే అనుకున్న డేట్‌కి ఈ సినిమాని విడుదల చేయలేకపోతున్నామని వర్మ పేర్కొన్నారు. అసలు రీజన్ ఏంటంటే ఈ సినిమాకి సెన్సార్ కష్టాలు వెంటాడుతున్నాయట. అనుకున్న టైంకి సెన్సార్ పనులు పూర్తయ్యి ఉంటే సినిమాని ఈ నెల 30న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ సెన్సార్ కాని కారణంగా విడుదల డేట్ పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది.
వర్మ శిష్యుడైన సిద్దార్ద్ ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నాడు. కన్నడ నటుడు ధనుంజయ్ హీరోగా నటిస్తున్నాడు. కొత్త భామ ఇర్రా మోర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వర్మ మార్కు ఫ్యాక్షన్, రొమాన్స్ ఈ సినిమాలో పుష్కలంగా కనిపిస్తోంది. హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీని, అక్కడక్కడా లిప్‌లాక్స్ జోడించి చూపించిన వైనం ఈ తరం కుర్రకారును ఎట్రాక్ట్ చేసేలా ఉంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్, ఫ్య్యాక్షనిజాన్ని బీభత్సంగా చూపించారని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది. హీరోయిన్ చేత కూడా కత్తి పట్టించి పవర్‌ఫుల్ యాక్షన్ చూపించేశారు. ఓ పక్క డైరెక్టర్‌గా వర్మ బిజీగా ఉంటూనే, మరోపక్క నిర్మాతగా 'భైరవగీత' సినిమాని ప్రమోట్ చేయడంలోనూ పూర్తి పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇకపోతే ఈ నెల 30న విడుదల కావాల్సిన 'భైరవగీత'ను డిశంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అదే రోజు తెలంగాణాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్‌లో నచ్చిన పార్టీకి ఓటేసి, ధియేటర్‌కొచ్చి 'భైరవగీత'ను సినిమా చూసి విజయవంతం చేయాలని వర్మ అభిమానుల్ని కోరారు.
|