Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
pratapabhavalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

07 - 12 -2018 నుండి 13-12-2018 వరకు వారఫలాలు - - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం బంధువులను కలుస్తారు , వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచిపేరు లభిస్తుంది. కుటుంబంలో కాస్త కఠినంగా వ్యవహరించుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు లేదా నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకొనే విషయాల్లో స్పష్టత ఉండుట వలన తప్పక మేలుజరుగుతుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చర్చలకు అవకాశం ఉంది.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం ఆరంభంలో కాస్త ఒత్తడికి గురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సూచితం. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. జీవితభాగస్వామితో విభేదాలు మరింతగా పెరుగుటకు ఆస్కారం ఉంది. చర్చాపరమైన విషయాల్లో మీదైనా ఆలోచనలు అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది.   

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

 ఈవారం విహారయాత్రలకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో తీసుకున్న నిర్ణయాలకు సమాధానం చెప్పవలసి వస్తుంది. జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. పెద్దలతో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీనుకోండి , ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం కుటుంబంలో సభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడతాయి. సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు, ఆత్మీయుల ఆరోగ్యపరమైన సమస్యల వలన కొంత ఇబ్బంది తప్పక పోవచ్చును. జీవిత భాగస్వామితో సర్దుబాటు విధానం తప్పక మేలుచేస్తుంది. వాహనాల వలన ఇబ్బందులు లేదా ఖర్చులకు ఆస్కారం ఉంది, జాగ్రత్త. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.


సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. మీ మాటతీరు పెద్దలను ఆకట్టుకుంటుంది, వారినుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. విదేశాల్లో ఉన్న బంధువులతో ఊహించని విధముగా మనస్పర్థలు వచ్చే ఆస్కారం ఉంది , కాస్త ఈ విషయంలో జాగ్రత్తగా ఉండుట సూచన.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం కుటుంబంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు ఆవకాశం ఉంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేస్తారు, బద్ధకం వదిలివేయుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. రావల్సిన ధనం మిత్రులద్వారా చేతికి అందుతుంది. సంతానం విషయాల్లో కొంత ఆందోళన పెరుగుటకు ఆస్కారం ఉంది, నూతన ఆలోచనలు మొదలు పెడతారు. రుణపరమైన విషయాల్లో ఆందోళన వద్దు, బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉండుట సూచన. చర్చల్లో పాలగొంటారు.

 

 

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో ఒకింత ఆందోళనకు లోనయ్యే ఆస్కారం ఉంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడే ఆస్కారం ఉంది. చిన్న చిన్న విషయాల్లో మీ ఆలోచనలను తోటివారితో పంచుకుంటారు. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల మూలన నష్టపోతారు. విదేశిప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మంచి గుర్తింపును పొందుతారు. వ్యాపార సంభందమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో ఒకింత అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఉంది.
 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం పెద్దలను కలుస్తారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ప్రయాణాల్లో నూతన పరిచయాలకు అవకాశం ఉంది . వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది, చిన్న చిన్న పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్తగా ఉంటె నష్టపోయే ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉండేవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. సమయానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబంలో కాస్త సర్దుబాటు విధానం వలన తప్పక మేలుజరుగుతుంది.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

 ఈవారం చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. రావలిసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఎవ్వరితోను వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది.  

 


మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం మానసికంగా ఆదోళన చెందుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు, అధికారుల నుండి గుర్తింపును పొందుతారు. అధికారులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న మిత్రులతో కలిసి మీ ఆలోచనలు పంచుకుంటారు. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. నలుగురిలో పనిచేసే సమయంలో అవతలి వారి సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం బంధువులను కలుస్తారు , వారితో సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న విషయాల్లో మీ ప్రాధాన్యత ఎదుటివారికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. జీవితభాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సాధ్యమైనంత మేర కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. 

 

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులను నష్టపోయే ఆస్కారం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. బంధువుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తండ్రితరుపు బంధువులను కలుసుకుంటారు.
 

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 
మరిన్ని శీర్షికలు
sarasadarahasam