Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sri Swamy Vivekananda Biography

ఈ సంచికలో >> శీర్షికలు >>

వార ఫలం (నవంబర్ 01 - నవంబర్ 07) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకరమైన నిర్ణయాలను తీసుకొనే అవకాశం ఉంది. ధనముకు సంబంధించిన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. శని, ఆదివారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలను పొందుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనుల మూలాన నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తప్పక జాగ్రత్తలు పాటించుట అదేవిధంగా సమయానికి భోజనం చేయుట సూచన. బుధ, గురువారాల్లో కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకొనే ముందు అందరిని సంప్రదించుట వలన మేలు జరుగుతుంది. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట నూతన నిర్ణయాలను వాయిదా వేయుట మంచిది. వారం మొత్తంమీద తలపెట్టిన పనులలో మొదట్లో ఉన్న ఉత్సాహంను అదేవిధంగా కొనసాగించే ప్రయత్నం చేయుట మంచిది. తలపెట్టిన పనులను కొంత ఆలస్యంగా పూర్తి చేసే ఆస్కారం కలదు. భోజనం విషయంలో కొంత అసంతృప్తిని మాత్రం పొందుటకు అవకాశం ఉంది. అధికారుల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును, ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. తోటిఉద్యోగులతో నిదానంగా వ్యవహరించుట వలన మేలు జరుగుతుంది. పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట ఉత్తమం.     

వృషభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున మాత్రం కొంత పనులలో నిదానంగా వ్యవహరించుట మంచిది. తలపెట్టిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో కుటుంబసభ్యులతో, మిత్రులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. తలపెట్టిన పనులలో ధనలాభంను పొందుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది. సోమ, మంగళవారాల్లో ఇతరులకు సేవచేయుట మూలాన గుర్తింపును కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు.  వాటిని అమలు పరిచే దిశలో అడుగులు వేస్తారు. బుధ, గురువారాల్లో స్వల్ప ఆరోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం కలదు. కావున సరైన సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. పనులలో కొంత శ్రమను తప్పక పొందుటకు అవకాశం ఉంది. వారం మొత్తం మీద ప్రయత్న కార్యములలో విజయంను పొందుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలను ఆరంభించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొత్త అవకాశాలు కలుగుటకు అవకాశం కలదు. బంధుమిత్రులతో కొంత నిదానంగా వ్యవహరించుట మంచిది. వినోదములలో పాల్గొంటారు. చర్చా సంభందమైన విషయాల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. నూతన వస్త్ర ప్రాప్తిని కలిగిఉండే అవకాశం ఉంది. ధర్మ సంభందమైన విషయాల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. అధికారులను కలుసుకునే అవకాశం ఉంది. వారి మూలాన లాభం ఉంటుంది. 

మిథున రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున బంధుమిత్రులతో మాట పట్టింపులకు పోకపోవడం ఉత్తమం. పనులలో నిదానం వ్యవహరించుట వలన విభేదాలు తగ్గుటకు ఆస్కారం కలదు. ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు కలుగుట మూలాన కొంత ఆందోళన చెందుటకు ఆస్కారం ఉంది. శని, ఆదివారాల్లో తలపెట్టిన పనులను మధ్యలో ఆపవలసి రావచ్చును. కావున ఈవిషయంలో తగిన విధమైన జాగ్రత్తలు తీసుకోండి. ఒక అశుభవార్తను వినే అవకాశం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట ఉపయోగపడుతుంది. సోమ, మంగళ వారాల్లో కొంత ఆర్థికపరమైన విషయాల్లో ఊరట లభిస్తుంది. పెద్దల సూచనల మేర సరైన నిర్ణయాలు తీసుకుంటే మేలుజరుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. నచ్చిన పనుల కోసం సమయాన్ని కేటాయిస్తారు. బుధ, గురువారాల్లో నూతన పరిచయాలు పొందుతారు. వారి మూలాన కొంత సంతోషాన్ని పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాలు లాభంను కలిగించేవిగా ఉంటవి. వారం మొత్తంమీద బంధుమిత్రుల మూలాన ధనవ్యయంను పొందుతారు. వారితో కలిసి చేపట్టిన పనులలో శ్రమను, ఆర్థికపరమైన ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. కచ్చితమైన నిర్ణయాలు తీసుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. నచ్చిన వ్యక్తులను కలుస్తారు. వారికి సమయాన్ని కేటాయిస్తారు. విభేదాలకు, వివాదములకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.

కర్కాటక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. కాకపోతే నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. ఇష్టమైన వారితో సమయాన్ని నచ్చిన విధంగా గడిపే అవకాశం ఉంది. మనోదైర్యంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. శని, ఆదివారాల్లో పనులలో శ్రమను కలిగి ఉంటారు. అకారణంగా విభేదాలు కలిగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. నూతన ప్రయత్నాల పట్ల నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. బంధువులతో మీ ఆలోచనలను మోహమాటం లేకుండా తెలియజేయటం ఉత్తమం. సోమ, మంగళవారాల్లో మాటలను పొదుపుగా వాడుట వలన తప్పక మేలు జరుగుతుంది. అందరిని కలుపుకొని వెళ్ళు ప్రయత్నం చేయండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చును. అధికమైన శ్రమను చేయండి మంచిది. బుధ, గురువారాల్లో పెద్దల సహకారంను అలాగే మిత్రుల సహకారంను పొందుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత వెసలుబాటు కలుగుతుంది. వారం మొత్తంమీద ప్రయాణాలలో ఇబ్బందులు పొందుతారు.  మార్గమధ్యలో ఆటంకాలు పొందుతారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళుట సూచన. కుటుంబంలో కొత్త ఆలోచనలు చేయకండి. అకారణంగా భయంను పొందుతారు. దైవ సంభందమైన వాటిలో పాల్గొనండి. మాత్రుసంభందమైన విషయాల్లో మేలుజరుగుతుంది వారితో సమయాన్ని గడుపుతారు.  
  

సింహ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున చేసిన శ్రమకు తగ్గ ఫలితంను పొందక పోవచ్చును కావున సర్దుకుపొండి. సమయానికి భోజనం చేయుటలో విఫలం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో ఈరోజు నిర్ణయం తీసుకోకండి. శని, ఆదివారాల్లో ఇష్టమైన వారిని కలుపుకొని ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో కుటుంబ సభ్యుల మూలాన ఒకింత ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. గతంలో తలపెట్టిన పనులపైన మరింత శ్రద్ధను చూపు ప్రయత్నం ఉత్తమం. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో ఆరోగ్య మూలక సమస్యలు కలుగుతాయి. వాటి పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోండి. నూతన పనులను చేపట్టకండి. వాటిని మధ్యలో ఆపవలసి రావచ్చును. ఆటంకాలు కలుగుతాయి జాగ్రత్త. వారంమొత్తంమీద బంధుమిత్రులను కలుస్తారు వారితో మీమనసులోని మాటను పంచుకొనే అవకాశం ఉంది. సంతాన మూలక సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంను కలిగి ఉంటారు. గాయములు అయ్యే అవకాశం కలదు జగ్రత్తగా ఉండుట సూచన. అధికారులకు అనుగుణంగా నడుచుకొనే ప్రయత్నం మేలుచేస్తుంది. సౌఖ్య జీవితంను పొందుటకు అవకాశం కలదు.

 

కన్యా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు. అందుకోసం సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. మీ ఆలోచనల నిమిత్తం సమయాన్ని గడుపుతారు. స్త్రీ/పురుష సౌఖ్యంను పొందుటకు అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో భోజనం విషయంలో తప్పనిసరిగా సమయపాలన పాటించుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలను తీసుకోకండి. అందరిని కలుపుకొని వెళ్ళు ప్రయత్నం చేయుట వలన కొన్ని విషయాల్లో కొంత మెరుగైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో తలపెట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆశించిన ఫలితాలు రావడం మూలాన కొంత సంతోషంను పొందుటకు అవకాశం ఉంది. నూతన వస్త్రలాభంను కలిగిఉంటారు, షాపింగ్ ల కోసం సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. బుధ, గురువారాల్లో పనులలో మిశ్రమఫలితాలు కలుగుతాయి. పనుల విషయంలో మాత్రం పెద్దలకు అనుగుణంగా నడుచుకొనుట వలన లబ్దిని పొందవచ్చును. వారంమొత్తం మీద చేయువృత్తిలో ధనమునకు సంబంధించిన విషయాల్లో ఆశించిన కన్నా అధికమొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన ఆలోచనలు వద్దు. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి. మంచివారితో కల పరిచయాలు నూతన అవకాశాలను కలగజేస్తాయి.

తులా రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున ధనముకు సంబంధించిన విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. కొంత మేర నష్టాన్ని తగ్గించుకొనే అవకాశం ఉంది. అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వాటిని అదుపులో ఉంచుకోండి. శని, ఆదివారాల్లో ఆర్థికంగా నూతన అవకాశాలు పొందుతారు. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఉత్సాహంను కలిగి ఉండి పనులపైన ప్రత్యేకశ్రద్ధను కలిగి ఉంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. భోజనం విషయంలో ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు. సోమ, మంగళవారాల్లో వ్యాపారంలో కొంత జాగురుకతతో మెలగండి మంచిది. ఆరోగ్యం విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. మొదలు పెట్టిన పనులలో చాలావరకు ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభించక పోవడం ఉత్తమం. బుధ, గురువారాల్లో ఇష్టమైన వారిమూలన నచ్చిన అవకశాలను పొందుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాలు పెరుగుతాయి. వాటిని ఉపయోగించుకొనే ప్రయత్నం చేయుట వలన మేలుజరుగుతుంది. వారంమొత్తం మీద సమయానికి భోజనం చేయుట వలన మేలుజరుగుతుంది. బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది. కావున నిదానంగా వ్యవహరించుట సూచన. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి. తప్పక మేలుజరుగుతుంది. మనోదైర్యంను కలిగి ముందుకు వెళ్తారు. సమయానికి భోజనం చేయండి.


వృశ్చిక రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. బంధువులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది. అధికారులకు అనుగుణంగా నడచుకొనే అవకాశం కలదు వాటి మూలాన కొంత లాభంను పొందుతారు. శని, ఆదివారాల్లో అధికమైన ఆలోచనలు కలిగిఉంటారు. వాటిమూలాన ధనమును నష్టపోయే అవకాశం కలదు. బంధు, మిత్రులతో మాట పట్టింపులకు పోకండి. నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. సోమ, మంగళవారాల్లో ఉద్యోగంలో కొంత ఆశించిన ఫలితాలు కలుగుతాయి. పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉండుట వలన ఫలితాలు అనుకూలంగా కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. నూతన అవకాశాల కోసం ప్రయత్నం ఆరంభిస్తారు. బుధ, గురువారాల్లో పనిఒత్తిడి మూలాన పనులలో శ్రమను పొందుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. వారంమొత్తం మీద ప్రయాణాలు చేయవలసి రావచ్చును. ఆప్తుల ఆరోగ్యం కొంత ఇబ్బందిని కలగజేసే అవకాశం ఉంది. అనుకోకుండా ఖర్చులు పెరుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. సంచారం చేయుట వలన ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు. వారితో సమయాన్ని గడుపుతారు. నూతన ప్రయత్నాలు ఆరంభిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నిదానం అవసరం.


ధనస్సు రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున అధికారులకు అనుగుణంగా నడుచుకుంటారు. ప్రయత్నాలలో లాభంను పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని సంతోషంగా గడిపే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. భోజన సౌఖ్యంను కలిగి ఉంటారు. తలపెట్టిన పనులలో ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు. సోమ, మంగళవారాల్లో అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ఖర్చు అవ్వడం మూలాన కొంత ఇబ్బంది పొందుతారు. ప్రయాణాలు చేయుట మూలాన కొంత ఇబ్బంది తప్పక పోవచ్చును. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. కావున నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. బుధ, గురువారాల్లో కొంత మేలుజరుగుతుంది. నూతన పనులను ఆరంభించి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. వారం మొత్తం మీద శుభకార్యములలో పాల్గొంటారు, మధుర పదార్థముల యందు ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుటకు అవకాశం ఉంది. నూతన పనుల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. స్థానచలనమునకు అవకాశం కలదు. నచ్చని ప్రదేశంలో నివశించవలసి రావచ్చును. పెద్దల ద్వార ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. రాజకీయ వ్యవహారాల్లో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి.

మకర రాశి

ఈవారం మీరు శుక్రవారం రోజున కుటుంబంలో ఆశించని విధంగా మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. కావున నిదానంగా వ్యవహరించుట తప్పక మేలుచేస్తుంది. మరొకప్రదేశంలో నివసించవలసి రావచ్చును. స్వల్పఆరోగ్య సమస్యలు కలుగుతాయి జాగ్రత్త. శని, ఆదివారాల్లో ఉద్యోగంలో అనుకున్న ఫలితాలను పొందుతారు. నూతన అవకాశాలు కలుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో సంతృప్తిని పొందుతారు. ఇష్టమైన పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. వారితో సమయాన్ని గడుపుతారు. సోమ, మంగళవారాల్లో బంధుమిత్రులతో అధికమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంది. వారితో కలిసి నూతన పనులను చేపట్టే అవకాశం ఉంది. రాజకీయ వ్యహరాలలో సమయాన్ని గడుపుతారు. వాటిపట్ల శ్రద్ధను కనబరుస్తారు. పెద్దలకు అనుగుణంగా నడుచుకోండి. బుధ, గురువారాల్లో అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వాటి మూలాన కొంత మానసికంగా సమస్యలు తప్పక పోవచ్చును. నూతన పనులను ఆరంభించక పోవడం ఉత్తమం. వారం మొత్తంమీద వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేయుట మంచిది. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మూలాన మంచిపేరును సంపాదించుకోగలుగుతారు. తోటిఉద్యోగులను కలుపుకొని పనిచేయుట ఉత్తమం. విలువైన వస్తువుల విషయంలో తప్పని సరిగా తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది.


కుంభ రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున సమయానికి భోజనం చేయుట ఉత్తమం. ధనమునకు సంబంధించిన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం మేలు. ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించుట ఉత్తమం. శని, ఆదివారాల్లో కుటుంబంలో నూతన నిర్ణయాలు చేయకండి. అందరిని కలుపుకొని వెళ్ళు ప్రయత్నం చేయండి. సర్దుబాటు విధానం అవలంబించుట చేత వివాదములు తగ్గుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో నిదానంగా వ్యవహరించుట అలాగే అందరిని కలుపుకొని వెళ్ళట వలన మేలుజరుగుతుంది. సోమ, మంగళవారాల్లో ఉద్యోగంలో బాగుంటుంది.  మీపైన వచ్చిన నిందలు వాటి అంతటకు అవే తొలగుటకు ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. బంధువులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు. బుధ, గురువారాల్లో భోజనసౌఖ్యంను కలిగి ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. సంతోషంగా సమయాన్ని గడుపుతారు. మిత్రులను కలిసి వారికి మీ ఆలోచనలను తెలియజేసే అవకాశం ఉంది. వారంమొత్తం మీద అనుకోకుండా ఖర్చును కలిగి ఉంటారు. కొంత మానసికంగా మనోవిచారంను కలిగి ఉంటారు. ధార్మిక సంభందమైన విషయాలకు సమయాన్ని ఇవ్వడం వలన తప్పక మేలుజరుగుతుంది. మాటను పొదుపుగా వాడుట వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో నిదానంగా వ్యవహరించుట మంచిది. ఇతరులకు సహాయం చేస్తారు.

మీన రాశి
ఈవారం మీరు శుక్రవారం రోజున నలుగురిలో మీరు చేసిన పనుల మూలాన గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. రాజకీయ వ్యవహారాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది. నూతన పనుల పట్ల ప్రత్యేక ఇష్టంను చూపిస్తారు. శని, ఆదివారాల్లో ఆరోగ్యం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు చేపట్టాలి. సమయానికి భోజనం చేయట వలన మేలుజరుగుతుంది. పని విషయంలో ఒత్తిడిని కలిగి ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి పూర్తిచేయుట మంచిది. సోమ, మంగళవారాల్లో కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన మేలు జరుగుతుంది. చర్చలు జరుగుటకు అవకాశం కలదు. అందులో నిదానంగా వ్యవహరించుట చేయండి. అవతలి వారి మాటలను వినుట వలన మేలు జరుగుతుంది. బుధ, గురువారాల్లో ఆర్థికపరమైన విషయాల్లో కలిసి వస్తుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేయుట ద్వారా గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. బంధువుల యెడల ప్రీతిని కలిగి ఉంటారు. వారంమొత్తం మీద అధికారుల మూలాన పనిబారంను పొందుతారు. సర్దుబాటు విధానం కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. మిత్రులను కలుస్తారు. మాత్రువర్గం ద్వార నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఇష్టమైన పనులను పూర్తిచేయుట యందు ఆసక్తిని కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మాటలను పొదుపుగా వాడుట అనేది సూచన. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వ్యతిరేకవర్గం వారి నుండి చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది.

శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని శీర్షికలు
a real friend by bannu