కావలసిన పదార్థాలు:
పచ్చిమిర్చి, చింతపండు, ఆవాలు, మెంతులు, కొత్తిమీర, ఉప్పు
తయారు చేయు విధానం:
ముందుగా బాణలిలో నూనె వేడి చేసుకొని కొన్ని మెంతులు, ఆవాలు వేసుకోవాలి, అవి కొద్దిగా వేగాక అందులో పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. దానిలో కొద్దిగా చింతపండు వేసుకొని, కొద్దిగా వేగాక, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అవి వేగాక స్టవ్ ఆపేసి, చల్లారిన తరువాత వాటిని రోట్లో వేసి, కొద్దిగా ఉప్పు వేసుకొని రుబ్బుకోవాలి.
|