Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
poem stories competetion

ఈ సంచికలో >> శీర్షికలు >>

25-01-2019 నుండి 31-01-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం కుటుంబంలో సభ్యులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానం వలన నలుగురిలో గుర్తింపు లభిస్తుంది, వారి విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలను పెద్దల మద్దతుతో తీసుకొనే అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో అనవసరమైన ఆలోచనలకు లోనయ్యే ఆస్కారం ఉంది, ఈ విషయంలో కాస్త ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. గతంలో తలపెట్టిన పనులను మధ్యలో ఆగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. తల్లి తరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి.

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

 ఈ వారం ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులను నలుగురికి ఉపయోగపడేలా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీకు గతంలో ఉన్న పరిచయాలు ఉపయోగపడుతాయి. ఆర్థికంగా కాస్త ఊరట లభిస్తుంది. మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు, అలాగే వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. సమయానికి భోజనం చేయుట ద్వారా ఇబ్బందులను తగ్గించుకోవచ్చును. బంధువుల నుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి, నిర్ణయాల కన్నా ముందు అనుభవజ్ఞుల అభిప్రాయ సేకరణ అవసరం. ప్రయాణాలు చేయవచ్చు.

 

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. సంతానపరమైన విషయాల్లో పెద్దలనుండి వచ్చే సూచనలు అమలుచేసే ప్రయత్నం చేయుట మంచిది. సోదరులతో చేపట్టిన చర్చలు ఆశించిన మేర ఫలితాలను ఇవ్వకపోవచ్చును. భూసంభందమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి కీలకమైన సమాచారం లభిస్తుంది. మిత్రులతో కలిసి విందులలో పాల్గొనే అవకాశం ఉంది. గతంలో మీకున్న స్నేహాలు తిరిగి మొదలయ్యే అవకాశం ఉంది. పూర్వీకుల మీకు రావాల్సిన ఆస్థి పరమైన విషయాల్లో ఎమన్నా ఇబ్బంది ఉంటె తొలగిపోయే అవకాశం ఉంది, మీది మీకు చెందుతుంది. 

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

 ఈవారం కుటుంబంలో పెద్దలతో చర్చలకు అవకాశం ఉంది. వారి సూచనల మేర ముందుకు వెళ్ళండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే ముందు అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపార పరమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. జీవితభాగస్వామి నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోండి. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. ఉద్యోగంలో చేసిన నూతన ప్రయత్నాలు పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చును. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే అవకాశం ఉంది. వారితో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రణాళిక లేకపోతే నూతన సమస్యలు వస్తాయి. 

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

 ఈవారం ముఖ్యమైన విషయాల్లో కాస్త ఆచితూచి వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. బంధువులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. మీ మాటతీరు మూలాన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. నూతన ప్రయాణాలు కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.

 

 

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వారితో మీ ఆలోచనలను పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. ఎవ్వరితోను మాట పట్టింపులకు వెళ్ళకండి. దూరద్రుష్టిని కలిగి ఉండుట వలన మేలుజరుగుతుంది. సంతానం వలన ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు అవకాశం ఉంది, కాకపోతే ఖర్చులు కూడా అదుపులో ఉండకపోవచ్చును. వారం చివరలో మిత్రులతో స్వల్ప విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది, ఈ విషయంలో సాధ్యమైనంత మేర జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, నూతన పరిచయాలు ఏర్పడుతాయి.

 

 

 


తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, మీ ఆలోచన ధోరణి వలన నస్టపోయే ఆస్కారం కలదు. చేపట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేయుటలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు, పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులను పెద్దలనుండి పొందుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన  ఇబ్బందులు తప్పకపోవచ్చును, తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వాహనాల వలన కాస్త ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త. 
.

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం మిత్రులతో అధికసమయం గడుపుతారు, నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేస్తారు. పెద్దలనుండి ఆశిచిన మేర సహకారం లభిస్తుంది , అలాగే వారి పనులను పూర్తిచేయుట ఉత్తమం. కుటుంబసభ్యుల నుండి కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది , దీనికి కారణం బంధువులు అయ్యే ఆస్కారం ఉంది , జాగ్రత్తగా ఉండుట మంచిది. బంగారు అలాగే విలువైన వస్తువుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట మంచిది. ఉద్యోగంలో నలుగురి నుండి ప్రశంశలు పొందుతారు.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర నిదానంగా వ్యవహరించుట సూచన. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సోదరులతో చేపట్టిన చర్చలు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు. కొన్ని కొన్ని ఫలితాల్లో కాస్త నిరాశను పొందుటకు అవకాశం ఉంది, మానసికంగా దృడంగా ఉండుట సూచన విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది.

 

 

 

 


మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం బంధువులను లేక ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది. వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. అనుకోకుండా చేసే ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో కలిసి విందుల్లో, వినోదాలలో పాలగోనే అవకాశం కలదు. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది , వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం కలదు. తండ్రి లేదా తండ్రి తరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది. కుటుంబంలో సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం కలదు.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం చేపట్టే పనులపట్ల స్పష్టత లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. వారై సూచనల ప్రకారం ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబాటు ఉంటుంది. వాహనాల వలన ఇబ్బందులు అలాగే ఖర్చు తప్పక పోవచ్చును. సాధ్యమైనంత మేర చర్చలకు అవకాశం ఇవ్వకండి. బంధువులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది.  

 

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే సంతోషం అలాగే ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. ఈ విషయంలో కాస్త హుందాగా వ్యవహరించుట మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది, కొంత ఇబ్బందులు తప్పక పోవచ్చును. గట్టిగా ప్రయత్నం చేయుట ద్వారా మాత్రమే కొన్ని పనులను పూర్తిచేయగలుగుతారు. కొన్ని కొన్ని విషయాల్లో మీ మాటతీరు మీ దగ్గరి వారిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది, అలాగే వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. అధికారుల నుండి ప్రశంశలు అలాగే ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెట్టుబడులకు మంచి సమయం , ఆలోచనల్తో ముందుకు వెళ్ళండి.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

 
మరిన్ని శీర్షికలు
prakatanalu cartoons