Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
Sensitive perspective

ఈ సంచికలో >> శీర్షికలు >>

15-02-2019 నుండి 21-02-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం ఆత్మీయులను కలిసే అవకాశం ఉంది, వారినుండి ముఖ్యమైన సమాచారం వస్తుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరులకు మాటఇచ్చే ముందు శక్తికి మించి ఆలోచన చేయకపోవడం సూచన. బంధువులను కలుస్తారు , వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. కోపాన్ని తగ్గించుకోవడం సూచన. చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. కాకపోతే ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం ఆరంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కాస్త తడబాటు చెందుతారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీ ఆలోచనలు పెద్దలతో పంచుకుంటారు. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. బంధువులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. 
 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం మొదట్లో చిన్న చిన్న ఇబ్బందులు పొందుతారు , బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మీ మాటతీరులో ఎంత స్పష్టత ఉంటే అంత మంచిది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. చర్చాపరమైన విషయాల్లో నిదానం అవసరం.  

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం ఇబ్బందులు తప్పక పోవచ్చును, ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. తల్లితరుపు వారితో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం ఉద్యోగంలో అభివృద్ధిని పొందుతారు, గతంలో మీకు పెద్దలతో ఉన్న పరిచయం ఉపయోగపడుతుంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, సమయాన్ని సరదాగా గడపడానికి ఇష్టపడుతారు. చర్చాపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. చిన్న చిన్న విషయాల్లో మీ ఆలోచనలు బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరప్రదేశంలో ఉన్న వారినుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త.  

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

 ఈవారం ఆరంభంలో మానసికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. సామాజికపరమైన విషయాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. సంతానపరమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు.

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకొండి. వ్యాపారపరమైన విషయాల్లో బాగాఆలోచించి ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న పనులు చేపట్టునపుడు వాటిపై పూర్తిస్థాయి అవగాహన అవసరం. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సాధ్యమైనంత మేర ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం సూచన. కుటుంబంలో సభ్యుల మధ్య వివాదం రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. విలువైన వస్తువులపై మక్కువను కలిగి ఉంటారు.

 

.

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త తగిన జాగ్రత్తలు తీసుకోండి.సాధ్యమైనంత వారు అనవసరమైన చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. కుటుంబంలో బాధ్యతలు పెరుగుటకు ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు మద్యలో ఆగిపోయే అవకాశం ఉంది. రావాల్సిన ధనం విషయంలో స్పష్టత లేకపోతే ఇబ్బంది తప్పక పోవచ్చును. తల్లితరుపు బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. పెద్దలను కలుస్తారు, వారై సూచనలను పరిగణలోకి తీసుకోండి.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేక బదిలీ ఉంటుంది. అధికారుల నుండి వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. సంతానం తో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది, వారై విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తుటకు ఆస్కారం ఉంది. అధికారులతో లేక పెద్దలతో మీకు ఉన్న పరిచయం బలపడే ఆస్కారం ఉంది. చర్చలు చేస్తారు , వాటిలో పాల్గొంటారు.

 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చర్చాపరమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ముఖ్యమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం సూచన. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మంచి పరిణామాలు ఉంటాయి, ఇబ్బందులు తగ్గుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను లేదా వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

 ఈవారం కుటుంబంలో ముఖ్యమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి,దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.  ముఖ్యమైన విషయాల పై ఏమాత్రం అశ్రద్ధ కూడదు. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా అవగాహన కలిగి ఉండుట సూచన. ఉద్యోగంలో బాగానే ఉంటుంది, తోటివారి నుండి అనుకున్న సహకారం అందుతుంది.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

 ఈవారం మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. తలెపట్టిన పనులను పూర్తిచేయుటకు ఒకింత సమయం పడుతుంది, వేచిచూసే ధోరణి మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న , ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతుంది. సంతానం విషయంలో పూర్తిగా సంతృప్తిని కలిగి ఉంటారు. మిత్రులనుండి లేక సోదరుల నుండి సహకారం లభిస్తుంది. ఆరోగ్యం బాగాఉంటుంది. దైవపరమైన విషయాల్లో సమయం గడుపుతారు. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం.
 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని శీర్షికలు
The things you need to know about mascara