Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly-horoscope 15th february to 21st february

ఈ సంచికలో >> శీర్షికలు >>

మస్కారా గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు - ..

The things you need to know about mascara

మస్కారా అనేది ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎక్కువగా వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ లో ముఖ్య స్థానం పొందింది. వేవేల భావాలను పలికే కళ్ళను మరింత అందంగా తీర్చిద్దిడుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే, కళ్ళకు డ్రమాటిక్ టచ్ ను అద్దడానికి అనేక ఐ ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మస్కారా స్థానం ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఫేక్ ఐ ల్యాషెస్ అనేవి రంగంలోకి దిగాయి. అయినా, మహిళల బ్యూటీ రొటీన్ లో మస్కారాకి ఉన్న ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. అయితే, చాలా మందికి మస్కారాను సరిగ్గా ఎలా వాడాలో పూర్తి అవగాహన లేదు. అసలు మస్కారా అనేది ఐ మేకప్ లో అవసరమేనా అనేది కూడా కొంతమందిలో నెలకొన్న ప్రశ్న. ఈ ఆర్టికల్ అనేది మస్కారా విషయంలో మీకున్న సందేహాలన్నిటికీ సమాధానం చెబుతుంది. మస్కారా ప్రాముఖ్యత, మస్కారాలో రకాలు అలాగే మస్కారాను వాడే చిట్కాల గురించి మస్కారాను అప్లై చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.

వివిధ రకాల మస్కారా

1. పొడవాటి మస్కారాలు : మీ ఐ ల్యాషెస్ చిన్నవిగా ఉన్నాయా? వాటిని పెద్దవిగా కనిపించేలా చేయాలని తాపత్రయ పడుతున్నారా? ఐతే, ఈ మస్కారా టైప్ మీకు అమితంగా ఉపయోగపడుతుంది. ఈ మస్కారాను అప్లై చేసుకునే అప్లికేటర్ అనేది పొడవుగా సన్నంగా ఉంటుంది.

2. ల్యాషెస్ ని దట్టంగా చేసే మస్కారా: ఈ మస్కారా టైప్ ని ఎక్కువమంది ప్రిఫర్ చేశారు. ఇది ల్యాషెస్ దట్టంగా కనపడేలా చేస్తుంది. ల్యాషెస్ కు థిక్ మరియు హెవీ లుక్ ను అందిస్తుంది. డ్రమాటిక్ ఐస్ కావాలనుకున్నవారు ఇటువంటి మస్కారాను ఎంచుకోవచ్చు.


3. డెఫినిషన్ మస్కారా : ఈ మస్కారా అప్లికేటర్స్ సాధారణంగా స్ట్రెయిట్ గా ఉంటాయి. ఈ టైప్ మస్కారా అనేది నేచురల్ డే లుక్ ను అందిస్తుంది. ఇది ల్యాషెస్ ను కొద్దిగా డార్క్ గా చేస్తాయి. నేచురల్ ఫినిష్ ను అందిస్తాయి.

4. వాటర్ ప్రూఫ్ మస్కారాస్ : పేరుకు తగ్గట్టుగానే వాటర్ ప్రూఫ్ మస్కారాస్ ను తొలగించుకోవడం కొంచెం కష్టతరం. ఇది త్వరగా తొలగిపోదు.
5. కర్వ్ మస్కారా : మస్కారాన్ కర్లర్స్ తో కూడా లభ్యమవుతాయి. స్ట్రెయిట్ ఐ ల్యాష్ ఉన్నట్లటీ ఈ మస్కారా ఐ ల్యాషెస్ ను కర్ల్ చేస్తుంది. అలాగే వాల్యూమ్ ను కూడా జోడిస్తుంది.

మస్కారాను ఎలా అప్లై చేయాలి? 1. ఐ మేకప్ పూర్తయిన తరువాత మస్కారాను ఉపయోగించాలి. ఇది ఐ మేకప్ లో లాస్ట్ స్టెప్. 2. మస్కారాను అప్లై చేసుకునే ముందు ల్యాషెస్ ను ఐ ల్యాష్ కర్లర్ తో కర్ల్ చేయండి. 3. మాస్కరాను ల్యాషెస్ బేస్ నుంచి అప్లై చేయడం ప్రారంభించండి. 4. లెఫ్ట్ నుంచి రైట్ కి మూవ్ చేస్తూ అప్లై చేయండి. అప్పర్ మరియు లోయర్ ల్యాషెస్ కు అప్లై చేయండి. 5. కళ్ళకి వెలుపలి కార్నర్ లో అప్లై చేసేటపుడు మస్కారా టిప్ తో అప్లై చేయండి. 6. ల్యాషెస్ కి మీరివ్వాలనుకుంటున్న ఇంపాక్ట్ ను దృష్టిలో ఉంచుకుని రెండు నుంచి మూడు కోట్స్ మస్కారాను మీరు అప్లై చేయాల్సి వస్తుంది.

మస్కారాను ఎలా మెయింటెయిన్ చేయాలి? 1. మస్కారాను తొలగించేందుకు వైప్ చేయవద్దు. 2. మస్కారా వేగంగా ఆరిపోతుంది. కాబట్టి మస్కారా లిడ్ ను త్వరగా టైట్ గా క్లోజ్ చేయండి. 3. ప్రతి మూడు నెలలకి ఒకసారి మస్కారాను రీప్లేస్ చేయండి. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ త్వరగా కంటామినేట్ అవుతాయి. 4. మాస్కరాస్ స్మడ్జ్ అవకుండా ఉండాలంటే కొంత ట్రాన్స్లుసెంట్ పౌడర్ ను కింది ల్యాషెస్ పై అద్దండి.

మీరు తప్పక ప్రయత్నించవలసిన మస్కారాస్ బ్లాక్ మస్కారాని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఐతే, వివిధ కలర్స్ తో కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. బ్లూ లేదా పర్పుల్ : ఇది తేనే రంగు కళ్ళకి బాగా సూట్ అవుతాయి. గ్రీన్ : బ్రౌన్ ఐస్ బ్రౌన్ : బ్లాండ్స్ కి బాగా సూట్ అవుతుంది

 

 

 

 

మరిన్ని శీర్షికలు
tamilnadu