Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
poems

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు… అందరికీ వందనాలు - ..

ఈ వారం ( 22/2 – 28/2 ) మహానుభావులు.

ఫిబ్రవరి 22

శ్రీ కొండా వెంకటప్పయ్య  : వీరు ఫిబ్రవరి 22,  1866 న గుంటూరులో జన్మించారు.  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, దేశభక్తబిరుదాంకితుడు. ఆయన గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవారు. ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులలో వెంకటప్పయ్య 1902లో వాసు నారాయణరావుతో కలసి కృష్ణా పత్రిక ప్రచురణను ప్రారంభించారు..

2. శ్రీ తాతినేని చలపతి రావు  : వీరు  ఫిబ్రవరి 22, 1938 న  , నందమూరు లో జన్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు.. సుమారు 20 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించి,  ఎన్నో ఎన్నెన్నో పాటలను స్వరపరిచారు.  ఆపాటలు ఇప్పటికీ సంగీతప్రియుల మనసుల్లో నిలిచే ఉన్నాయి..

ఫిబ్రవరి  24

శ్రీ పిలకా గణపతి శాస్త్రి :   విరు ఫిబ్రవరి 24, 1911 న , కట్టుంగ లో జన్మించారు. ప్రముఖ కవి, వ్యాఖ్యాత, రచయిత.  సంస్కృతాంధ్రాంగ్లాల్లో ప్రావీణ్యమే కాక హిందీ, బెంగాలీ, ఫ్రెంచ్ భాషల్లో కూడ అభినివేశం పొందిన వీరు కవి, నవలాకారుడు, కథకుడు, అధ్యాపకత్వం, పత్రికలలో ఉపసంపాదకత్వం కావించిన శాస్త్రిగారి రచనలు, రత్నోపహారం, మణిదీపిక (కావ్యాలు), విశాలనేత్రాలు, గృహిణి (నవలలు), విభ్రాంతామరుకం, ప్రమధ్వర, మణిదీపిక, ప్రాచీన గాథాలహరి  మొదలైనవి పిలకా గణపతి శాస్త్రిగారి ప్రతిభా సిగకి అలంకారాలు.

ఫిబ్రవరి 26

శ్రీమతి హేమలతాలవణం :    వీరు ఫిబ్రవరి 26, 1932 న  వినుకొండ లో జన్మించారు. శ్రీ గుర్రం జాషువా గారి కుమార్తె. 1961లో వాసవ్య విద్యాలయాన్ని స్థాపించి సమత, మమతల కోసం పాటుపడింది. శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో ఆర్థిక సమతా మండలి అని సేవా సంస్థను స్థాపించి వెనుకబడినవారిలో, నిమ్నకులాల్లో చైతన్యం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. జాషువా కావ్యాలు అందరికీ అందుబాటులో ఉండాలన్న దృఢసంకల్పంతో వాటినన్నిటినీ ముద్రించారు.. హేమలతాలవణం స్వయంగా పలు ప్రక్రియల్లో రచనలు చేసారు.. అహింసా మూర్తులు - అమర గాథలు, నేరస్థుల సంస్కరణం, జీవన ప్రభాతం లాటివి.

వర్ధంతులు

ఫిబ్రవరి 22

శ్రీ కన్నెగంటి హనుమంతు :  ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. అడవి పుల్లరి శాసనాన్ని దిక్కరించి అమరుడైన వీరుడు. పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే పుల్లరి సత్యాగ్రహంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటీషువారు అప్పటి గుంటూరు జిల్లాకలెక్టరు రూథర్‌ఫర్డు నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. చివరికి కన్నెగంటి హనుమంతు వీరమరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది.

వీరు ఫిబ్రవరి 22, 1920 రోజున స్వర్గస్థులయారు..

ఫిబ్రవరి 24

శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి :  ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితా రంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. ఆయన రేడియాలో లలితగీతాలు, నాటికలు, సినిమాల్లో పాటలు రాయడం ద్వారా ప్రఖ్యాతి పొందారు. . 1920లో వైద్యంకోసం రైలులో బళ్ళారి వెళుతూండగా ప్రకృతినుండి లభించిన ప్రేరణ కారణంగా "కృష్ణపక్షం కావ్యం" రూపు దిద్దుకొంది. హృదయ స్పందనలకు అక్షర రూపమిచ్చి భావ కవితలంత సుకుమారంగా ప్రణయ విరహ గీతాల్ని రాసిన కవి.

వీరు ఫిబ్రవరి 24, 1980 న స్వర్గస్థులయారు.

శ్రీ న్యాపతి రాఘవరావు :   రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత.

వీరు ఫిబ్రవరి 24, 1984 న స్వర్గస్థులయారు.

శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ  :   తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశారు.. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యారు.. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు. ఆయన ఆత్మకథ కోతి కొమ్మచ్చి అనే పుస్తక రూపంలో వెలువడింది.

బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు,  రాజాధిరాజు,  పెళ్ళిపుస్తకం,  మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత. 1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నారు..

వీరు ఫిబ్రవరి 24, 2011 న స్వర్గస్థులయారు.

ఫిబ్రవరి 25

శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి :  20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన.

వీరు ఫిబ్రవరి 25, 1961 న స్వర్గస్థులయారు.

ఫిబ్రవరి 28.

శ్రీ జానమద్ది హనుమఛ్ఛాస్త్రి  :   తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత.. 'బ్రౌన్ శాస్త్రి'గా పేరు గడించారు.. జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు.. 16 గ్రంథాలు వెలువరించారు..

వీరు ఫిబ్రవరి 28, 2014 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
sarasadarahasam