Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
How to be more consistent

ఈ సంచికలో >> శీర్షికలు >>

ద్రాక్షతో మేలు - ..

Good for grape

ద్రాక్షలో ఉండే గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, రోజు గుప్పెడు తింటే చాలా మేలు కలుగుతుంది. చాలా రకాల ప్రయోజనాలున్నాయి.

యాంటీ యాక్సిటెండ్స్
ద్రాక్షలో ఎక్కువగా యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో ద్రాక్షలో ఉండే ఫైటో ట్యూట్రియెంట్స్ బాగా పని చేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండడానికి ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. పాలీఫెనోల్స్, రెవెవర్ట్రాల్ కూడా ద్రాక్షలో అధికంగా ఉంటాయి. రక్తపోటు తగ్గించే గుణాలు ద్రాక్షలో ఉంటాయి.

చర్మ సమస్యలు పోతాయి

ద్రాక్షలో ఉండే రెస్వెట్రాల్ వృద్ధాప్య ఛాయల్ని తొలగిస్తాయి. చర్మ సమస్యలు పోతాయి. మొటిమలు తగ్గుతాయి. చర్మం సున్నితంగా కాంతివంగా ఉండేలా చేసే గుణాలు ద్రాక్షలో ఎక్కువగా ఉంటాయి.

పొటాషియం

ద్రాక్షలో పోషటాషియం ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ద్రాక్షలో191 ంగ్ పొటాషియం ఉంటుంది. పొటాషియం బాడీకి చాలా అవసరం. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు పొటాషియం తోడ్పడుతుంది. అలాగే నడుము దగ్గర ఉండే కొవ్వును పొటాషియం తగ్గించగలదు.

మెదడుకు మంచిది

మెదడుకు సంబంధించిన నరాలు బాగా పని చేసేందుకు ద్రాక్ష బాగా పని చేస్తుంది. మతిమరుపును పోగొడుతుంది. మెదడు బాగా పని చేసేలా చేయించే గుణాలు ద్రాక్ష బాగా పని చేస్తుంది.

కళ్లకు మంచిది
ద్రాక్ష కళ్లకు చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. ఇందులోని రెవెవర్ట్రాల్ కళ్లకు ఎంతో తోడ్పడుతుంది. మెదడు ప్రతిస్పందనలను వేగవంతం చేసే గుణం ద్రాక్షకు ఉంటుంది. అల్జీమర్స్ ను పోగొట్టగలదు.

మోకాలికి మంచిది

మోకాలి నొప్పితో బాధపడేవారు ద్రాక్ష తింటే మంచిది. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి వాటిని కూడా ద్రాక్ష పోగొడుతుంది. ద్రాక్షలో ఉండే పాలీఫెనోల్స్ కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్

ద్రాక్షలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ధమనులకు ఉపశమనం కలిగించగలదు. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేయగల ప్రత్యేక గుణాలు ద్రాక్షలో ఉంటాయి.

మరిన్ని శీర్షికలు