Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కవిత - ..

poem

వ్యక్తిత్వ వికాస సారథి..ఉగాది

ఇంగ్లీషోడి పర్సనాలిటీ డెవలప్మెంట్
అని మురిసిపోతారుగాని
మన నిత్య జీవన విధానమే అదని
తెలుసుకోరు
మన వేదాలు లోకాస్సమస్తా సుఖినోభవంతు అంటాయి
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అన్న ఉత్కృష్ట భావనది
ఉపనిషత్తుల్లో శాంతి మంత్రం ఉంది
సర్వత్రా శాంతి నెలకొని ఉండాలన్న తాపత్రయమది
అందరినీ కలుసుకుని, కలుపుకుపోయే పండగలున్నాయి
సమాజం కోసం తపించే హృదయాలున్నాయి
లే చివుళ్లతో, పూలతో అలంకరించుకున్న ప్రకృతి
ఆశాబావ దృక్పథానికి నాంది
కోకిల కూజితాలు
మనసును సాంత్వన పరచే సరాగాలు
దానాలు, ధర్మాలు
మరో మనిషిని ఆదుకునే ప్రయత్నాలు
వ్యక్తిత్వ వికాస సారథి ఉగాది
ఇది తెలుసుకోడమే నిజ జీవిత పునాది
ఇంత ఘనమైన జీవన విధానాన్ని వదులుకుని
పరదేశ సంస్కృతికి బానిసవ్వడం
నిన్ను నువ్వే కొవ్వోత్తిని చేసుకుని కాలి, కరిగిపోడం!

                                    -ప్రతాప వెంకట సుబ్బారాయుడు                
 

మరిన్ని శీర్షికలు
pratapabhavalu