Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈవారం  ( 17/5 – 23/5 ) మహానుభావులు

జయంతులు

 మే 17

శ్రీ శ్రీరంగం  నారాయణ బాబు :  వీరు, మే 17, 1906 న, విజయనగరం లో జన్మించారు. ప్రముఖ కవి. వీరు పద్య రచనలకు మరియు భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి సర్రియలిజం (Surrealism) అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే "సర్రియలిజం" అంటారు..  విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.

మే 18

శ్రీ కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు : వీరు మే 18, 1877 న, పెనుగంచిప్రోలు లో జన్మించారు. వీరు మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ నిర్మాత మరియు విజ్ఞాన చంద్రికా మండలిస్థాపకుడు. తెలుగువారికి చరిత్ర పరిశోధనలు పరిచయం చేసి, ఉన్నత ప్రమాణాలతో చరిత్ర, విజ్ఞాన రచనలను తెలుగులో అందించడానికి శ్రీకారం చుట్టిన ఉత్తమ విజ్ఞానవేత్త.

2. శ్రీమతి సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ  : వీరు మే 18, 1914 న వీరులపాడులో జన్మించారు. ప్రముఖ స్వాతంత్ర  సమరయోధురాలు, సంఘసేవకురాలు. మహిళ ఉద్యమాలలో, ఖద్దరు ప్రచారములో, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలలో ఎంతో పాటుపడ్డారు.. మహిళాభ్యుదయ సంస్థలో మద్యపానానికి వ్యతిరేకముగా పోరాడారు..

మే 19

శ్రీ నీలం సంజీవరెడ్డి  :  వీరు మే19, 1913 న ఇల్లూరు లో జన్మించారు. భారత రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్ సభ స్పీకర్ గా సేవలు అందించిన గొప్ప వ్యక్తి. ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు.

వర్ధంతులు

మే18

  1. డా. కానూరి లక్ష్మణ రావు. :  K L Rao  గా ప్రసిధ్ధులు. ప్రముఖ ఇంజనీరు. నాగార్జునసాగర్ సాకారం కావడానికి ఎంతో కృషి చేసారు. అనేక భారీ ఆనకట్టల రూపకల్పనలో వీరికి ఎంతో పాత్ర ఉంది.

వీరు మే 18, 1986 న స్వర్గస్థులయారు.

 

  1. శ్రీ సూరపనేని వెంకట సుబ్బారావు.  : వీరు “ కళాధర్ “ గా ప్రసిధ్ధి చెందారు. తెలుగుచలనచిత్రరంగంలో పేరు పొందిన కళాదర్శకుడు.  “ మాయాబజార్” వంటి ఎన్నో కళాఖండాలకు రూపకల్పన చేసారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శతాధిక చిత్రాలకు కళాదర్శకత్వం చేసారు.

    వీరు మే 18, 2013 న స్వర్గస్థులయారు.

 

  1. శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య :  సమకాలీన తెలుగు రచయితల్లో పేరెన్నికగన్నవారు. చక్రనేమి ఆయన రాసిన మొదటి కథ. వీరి రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంటాయి.. అతను 200 లకు పైగా కథలను వ్రాసారు.

    వీరు మే18, 2018 న స్వర్గస్థులయారు.

మే 21

శ్రీమతి యద్దనపూడి సులోచనా రాణి :  ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆలుమగల మధ్య ప్రేమలు, కుటుంబ కథనాలు రాయడంలో తనకు వేరెవరూ సాటిరారని నిరూపించిన వీరి రచనలు అనేకం. ఈమె కథలు పలు సినిమాలుగా మలచబడ్డాయి.

వీరు మే 21, 2018 న స్వర్గస్థులయారు.

మే 22

 

 మే 22

శ్రీ వేటూరి సుందరరామమూర్తి :   సుప్రసిధ్ధ తెలుసినీ గీత రచయిత. కొన్ని వేల పాటలను రాశారు. వీరికి  8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరి వారే..

మరిన్ని శీర్షికలు
weekly-horoscope may 17th to  may 23rd