Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
life

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఓ పిలగాడా.! నిన్ను కంట్రోల్‌ చేసేదెలా.? - ..

How do you control yourself?

ఒకప్పుడు టీనేజ్‌ పిల్లల కోసమే తల్లితండ్రులు భయపడేవారు. కానీ ఇప్పుడు యంగర్‌ జనరేషన్‌తోనే సమస్యలు తలెత్తుతున్నాయి. టీనేజ్‌ వయసు అంటే 16 - 18 ఏళ్ల వయసు పిల్లల విషయంలోనే పేరెంట్స్‌ టెన్షన్‌ పడేవారు. ఎలాంటి విపరీత ధోరణుల వైపైనా ఆకర్షించేందుకు ఆ టైం కీలకం. ఆ టైంని గట్టెక్కితే, పేరెంట్స్‌ పిల్లల విషయంలో విజయం సాధించేసినట్లే. కానీ ఇప్పుడు జనరేషన్‌ ముందుకొచ్చేసింది. 10 ఏళ్ల పిల్లాడినే కంట్రోల్‌ చేయలేని పరిస్థితి. దీనికంతటికీ కారణం టెక్నాలజీ.

టెక్నాలజీ పుణ్యమా అని పిల్లల మెదుడులు మరింత షార్ప్‌ అయిపోతున్నాయి. వారు కోరింది కోరినట్లు జరగకపోతే, తర్వాత జరిగే పరిణామాలు ఊహించిన రీతిలో ఉంటున్నాయి. మా పిల్లాడే కదా.. కంట్రోల్‌లో పెట్టేద్దాం అనుకుంటే పొరపాటే. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో పిల్లలు చాలా ఇన్నోవేటివ్‌గా ఆలోచిస్తున్నారు. పబ్‌జీ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌ కావచ్చు, యూ ట్యూబ్‌ ఛానెల్స్‌లో దొరికే అశ్లీల చిత్రాలు కావచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే, ప్రపంచం మొత్తం వారి చేతికి చాలా సులువుగా అందేస్తోంది. కాదేదీ ఈ జనరేషన్‌కి అనర్హం అనేంతగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు పిల్లలు. అదే అన్ని రకాల అనర్ధాలకూ కారణమవుతుంది.

ఆఫ్ట్రాల్‌ గేమే కదా.. అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఆ ఆఫ్ట్రాల్‌ గేమ్‌ని ఆడొద్దన్నందుకే పిల్లలు అవలీలగా ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉంది కదా.. అని తమకు తోచిన ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వీటిని కంట్రోల్‌ చేస్తే ఓ సమస్య. కంట్రోల్‌ చేయకుంటే ఇంకో సమస్యగా మారింది. ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇదో పరిష్కారం లేని మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిందిది. పేరెంట్స్‌కే కాదు, మానసిక నిపుణులు కూడా పరిష్కరించలేని సమస్యగా మారిందిది.

అయితే పిల్లలందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారా.? అంటే పూర్తిగా అవునని చెప్పలేం. కొందరు పిల్లలు 10 - 14 ఏళ్ల వయసుకే ఇదే టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. కొందరు పిల్లలు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుంటే, మరికొందరు తమ జ్ఞానాన్ని ఆకాశమే హద్దుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య ఓ 13 ఏళ్ల కుర్రాడు తన వయసుకు మించి, తన స్టామినాకి మించి ఐఏఎస్‌, ఐపీఎస్‌ శిక్షణా తరగతులు నిర్వహిస్తుండడం వార్తల్లో విన్నాం. టెక్నాలజీనే ఈ పిల్లాడి జ్ఞానానికి కారణమైంది అనడం అతిశయోక్తి కాదు. ఇలా వెలుగులోకి వచ్చిన వాళ్లు చాలా కొద్ది మందే ఉన్నారు. వెలుగులోకి రాని పిల్లగాళ్లు చాలా మందే ఉన్నారు. అన్ని అనర్ధాలకూ ఒక్కటే కారణం అనుకోవడానికి లేదండోయ్‌. రకరకాల కారణాలుంటాయి.

అతి పెద్ద సమస్యగా పరిణమించిన ఈ జాడ్యాన్ని అధిగమించాలంటే మనకున్న ఒకే ఒక్క దారి.. చుట్టూ ఉన్న పరిస్థితుల్ని వీలైనంతలో పాజిటివ్‌గా మలచుకోవడం తప్ప మరో దారి లేదని మానసిక నిపుణులు చెబుతున్నారు. అంతకు మించిన మందు కానీ, మార్గం కానీ ఈ సమస్యను పరిష్కరించలేదనేది వారి సలహా. సో తల్లితండ్రులూ మీరు చేయగలిగింది కూడా ఏమీ లేదు ఇది తప్ప.

మరిన్ని శీర్షికలు