కావలిసినపదార్ధాలు: ఉల్లిపాయలు, ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లిరేకులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర
తయారుచేసే విధానం: ఒక బాణలిలో నూనె వేసుకుని ఎండుమిర్చి, జీలకర్రను వేయించుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయముక్కలను కూడా అందులో వేసుకోవాలి. తరువాత కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. తరువాత అది చల్లారాక మిక్సీ లో వేయాలి. అంతేనండీ.. ఉల్లిపచ్చడి రెడీ..
|